Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (103.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 20/11/2016
ప్రజలు 10 నాణేల చట్టబద్ధ చెలామణి (లీగల్ టెండర్) అంగీకారం ను కొనసాగించాలి - ఆర్బీఐ

నవంబర్ 20, 2016

ప్రజలు 10 నాణేల చట్టబద్ధ చెలామణి (లీగల్ టెండర్) అంగీకారం ను కొనసాగించాలి - ఆర్బీఐ

భారత ప్రభుత్వం చే ముద్రించబడిన (మింట్ చేయబడిన) నాణేలను (కాయిన్లు) రిజర్వు బ్యాంక్ చెలామణిలోకి తెచ్చింది.ఈ నాణేలు విలక్షమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ప్రజల లావాదేవీల అవసరాలను తీర్చడానికి కొత్త డినామినేషన్ ల లోను మరియు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఇతివృత్తాలతో కొత్త డిజైన్ల లోను, నాణేలను ఎప్పటికప్పుడు చలామణిలోకి తీసుకురావడం జరిగింది. చెలామణిలో ఉన్న నాణేలు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండటం మూలాన, ఒకే సమయంలో వివిధ డిజైన్లలో మరియు ఆకృతిలలో ఈ నాణేలు మార్కెట్లో చట్టబద్ధంగా చలామణీలో ఉండటం పూర్తిగా సాధ్యమే. అటువంటి మార్పుల్లో జూలై 2011 సంవత్సరంలో నాణేలలో రూపాయి చిహ్నం (రుపీ సింబల్) ప్రవేశపెట్టడం ఒకానొక మార్పు. రూపాయి చిహ్నం (రుపీ సింబల్) కలిగిన 10 నాణేలు, అటువంటి చిహ్నం (రుపీ సింబల్) లేని అదే డినామినేషన్ గల నాణేలు ఒకే సమయంలో చలామణీలో ఉండటం ఇందుకు ఒక్క ఉదాహరణ. ఇవి కొంచెం భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ, ఈ రెండూ కూడా లావాదేవీల కోసం సమానంగా మరియు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి.

తక్కువ సమాచారంతోనూ లేదా అసలు తెలియకుండాను కొంతమంది వ్యక్తులు, ఈ నాణేలు చెల్లుబాటు కావనే తప్పుడు అపోహతో సామాన్య ప్రజల, వ్యాపారస్థుల, చిల్లర వర్తకుల, మొదలైన వారల మనస్సులలో సందేహాలు సృష్టిస్తున్నారని, దీనివల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నాణేల చెల్లుబాటుకు అవరోధం ఏర్పడి, అనవసర గందరగోళానికి దారితీసిందని మాకు తెలియచేయబడింది.

అటువంటి తప్పుడు ఉద్దేశ్యాలకు తావివ్వద్దని వాటిని దరిచేయనీయవద్దని మరియు లావాదేవీల కోసం ప్రజలు ఎటువంటి అనుమానం లేకుండా ఈ నాణేల చెల్లుబాటుకు అంగీకారం కొనసాగించాలని రిజర్వ్ బ్యాంకు ప్రజలకు తెలియచెప్పింది.

ఈ నాణేల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి ఈ క్రింది లింక్ ను సందర్శించండి: https://www.rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx

జారీ తేదీ పత్రికా ప్రకటనలు (ప్రెస్ రిలీజ్ లు)
జూన్ 22, 2016 రిజర్వ్ బ్యాంక్ త్వరలో స్వామి చిన్మయానంద శతజయంతిని పురస్కరించుకొని, 10 నాణేలు చెలామణిలోకి తేబొతున్నది
జనవరి 28, 2016 డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125 వ జన్మదిన వార్షికోత్సవ స్మారక సందర్భంగా 10 నాణేలు జారీ
జులై 30, 2015 అంతర్జాతీయ యోగాదినమ్ పురస్కరించుకొని 10 నాణేలు జారీ
ఏప్రిల్ 16, 2015 దక్షిణాఫ్రికా నుంచి మహాత్మాగాంధీ తిరిగివచ్చి నూరువత్సరాలైన స్మారకోత్సవం సందర్భంగా 10 నాణేల జారీ
జులై 17, 2014 కాయర్ బోర్డు వజ్రోత్సవం (Diamond Jubilee of Coir Board) స్మారక సందర్భంగా 10 నాణేలు జారీ
ఆగష్టు 29, 2013 శ్రీమాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం (ష్రైన్) బోర్డు రజతోత్సవ స్మారక సందర్భంగా 10 నాణేలు జారీ
జూన్ 14, 2012 భారత పార్లమెంటు షష్టిపూర్తి (60 సంవత్సరాలైన) స్మారక సందర్భంగా నాణేల జారీ
జులై 22, 2011 కొత్త క్రమం (న్యూ సిరీస్) లో నాణేల జారీ
ఏప్రిల్ 01, 2010 ఆర్.బీ.ఐ ఎట్ 75 (RBI at 75): ప్రధానమంత్రి చే స్మారక నాణేల సెట్; ఆర్థిక మంత్రి చే ‘మింట్ రోడ్ మైల్స్టోన్స్’ ల విడుదల
ఫిబ్రవరి 11, 2010 హోమీబాబా శతజయంతి సంవత్సర సందర్భంగా క్రొత్త 10 ద్విలోహాత్మక (బై-మెటాలిక్) స్మారక చెలామణి నాణేo జారీ
మార్చ్ 26, 2009 ‘భిన్నత్వం లో ఏకత్వం’ (యూనిటీ ఇన్ డైవర్సిటి) ఇతివృత్తం తో కొత్త 10 ద్విలోహాత్మక (బై-మెటాలిక్) నాణేలు
మార్చ్ 26, 2009 ‘సంధాయకత మరియు సమాచార సాంకేతికరంగం’ (Connectivity and Information Technology) ఇతివృత్తం తో కొత్త 10 ద్విలోహాత్మక (బై-మెటాలిక్) నాణేలు

జోస్ జె.కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్

ప్రెస్ రిలీజ్: 2016-2017/1257

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….