Note : To obtain an aligned printout please download the (70.00 kb ) version to your machine and then use respective software to print the story. |
Date: 21/10/2016 | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మయన్మార్ తో ‘సూపర్ వైజరీ సహకారం మరియు సూపర్ వైజరీ సమాచార మార్పిడి’ పై MoUపై సంతకాలు చేసిన RBI |
అక్టోబర్ 21, 2016
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మయన్మార్ తో ‘సూపర్ వైజరీ సహకారం మరియు సూపర్ వైజరీ
సమాచార మార్పిడి’ పై MoUపై సంతకాలు చేసిన RBI
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రిపబ్లిక్ యూనియన్ ఆఫ్ మయన్మార్ కు చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మయన్మార్ తో అక్టోబర్ 19, 2016న ఒక మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (MoU)పై సంతకాలు చేసింది. గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మరియు మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ H.E. అంగ్ సాన్ సూకీ సమక్షంలో జరిగిన ఈ MoUపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మయన్మార్ తరపున మయన్మార్ ప్రభుత్వానికి చెందిన సహాయ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ యూ క్యా తిన్ సంతకాలు చేయగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ తరపున డిప్యూటీ గవర్నర్ శ్రీ ఎస్ ఎస్ ముంద్రా సంతకాలు చేశారు.
దేశాల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించేందుకు, సూపర్ వైజరీ సమాచారాన్ని పంచుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ కొన్ని దేశాలకు చెందిన సూపర్ వైజర్లతో మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్, లెటర్ ఫర్ సూపర్ వైజరీ కో-ఆపరేషన్ మరియు స్టేట్ మెంట్ ఆఫ్ కో-ఆపరేషన్ ఒప్పందాలు చేసుకొంది. దీంతో ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ అలాంటి 34 MoUలు, ఒక లెటర్ ఫర్ సూపర్ వైజరీ కో-ఆపరేషన్ మరియు ఒక స్టేట్ మెంట్ ఆఫ్ కో-ఆపరేషన్ పై సంతకాలు చేసింది.
అల్పనా కిల్లావాలా
ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/995 |
|
|
|