అక్టోబర్ 24, 2016
ఇన్‌సెట్ అక్షరం 'L' కలిగిన, నెంబర్ ప్యానెళ్లలో ఆరోహక్రమంలో పెరిగిన సంఖ్యల పరిమాణము కలిగిన మరియు ఇంటాలియో (intaglio) ప్రింటింగ్ లేని 20 రూపాయల నోట్ల విడుదల
భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో మహాత్మ గాంధీ సిరీస్- 2005లో, రెండు నెంబర్ ప్యానెళ్లలో 'L' అన్న ఇన్ సెట్ అక్షరం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ రఘురామ్ రాజన్ సంతకం కలిగిన 20 రూపాయల బ్యాంకునోట్లను విడుదల చేయనుంది. ఈ బ్యాంకునోట్ల వెనుక వైపు నోటు ముద్రించిన సంవత్సరం ‘2016’ అని ముద్రించబడి ఉంటుంది.
ఇప్పుడు విడుదల చేయనున్న ఈ 20 రూపాయల బ్యాంకు నోట్ల డిజైన్ మరియు భద్రతా అంశాలు గతంలో మహాత్మ గాంధీ సిరీస్ - 2005లో జారీ చేసిన బ్యాంకునోట్లలో వలె రెండువైపులా ఉన్న నెంబర్ ప్యానెళ్లపై సంఖ్యల పరిమాణము ఆరోహక్రమంలో పెరుగుతూ ఉంటూ, ఇంటాలియో ప్రింటింగ్ లేకుండా, నిగూఢ చిత్రం లేకుండా, గుర్తింపు చిహ్నం లేకుండా ఉంటాయి. ఇంటాలియో ప్రింటింగ్ తొలగించడం కారణంగా ముఖభాగం వైపు ఉన్న రంగు గాఢత మాత్రం కొంత తగ్గి ఉంటుంది. (Ref: సెప్టెంబర్ 15, 2016 న విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ నెం. 2016-2017/678)
రిజర్వ్ బ్యాంక్ గతంలో జారీ చేసిన అన్ని 20 రూపాయల నోట్లు కూడా చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయి.
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1004 |