నవంబర్ 07, 2016
శ్రీ ఎమ్. రాజేశ్వర్ రావును కొత్త ఈడీగా నియమించిన RBI
భారతీయ రిజర్వ్ బ్యాంక్ శ్రీ జి. మహాలింగం స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో శ్రీ ఎమ్. రాజేశ్వర్ రావును కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా శ్రీ ఎమ్. రాజేశ్వర్ రావు గణాంకాలు, సమాచార నిర్వహణ విభాగం, ఆర్థిక మార్కెట్ల కార్యకలాపాల విభాగం, అంతర్జాతీయ విభాగాలను పర్యవేక్షిస్తారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు శ్రీ ఎమ్. రాజేశ్వర్ రావు ఆర్థిక మార్కెట్ల కార్యకలాపాల విభాగపు చీఫ్ జనరల్ మేనేజర్ బాధ్యతలు నిర్వర్తించారు.
శ్రీ రాజేశ్వర్ రావు ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు యూనివర్సిటీ ఆఫ్ కొచ్చిన్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టాలను కలిగి ఉన్నారు. అంతే కాకుండా ఆయన ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ లో సర్టిఫైడ్ అసోసియేట్ గా ఉన్నారు.
1984లో రిజర్వ్ బ్యాంక్ లో చేరిన శ్రీ రాజేశ్వర్ రావు సెంట్రల్ బ్యాంక్ యొక్క వివిధ కార్యకలాపాలలో విస్తృతమైన అనుభవం కలిగి ఉన్నారు. ఆయన గతంలో రిస్క్ మానిటరింగ్ విభాగపు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన న్యూఢిల్లీలో బ్యాంకింగ్ ఆమ్ బుడ్స్‌మన్ గా పనిచేశిన వీరు గతంలో అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ ప్రాంతీయ కార్యాలయాలలోనూ పని చేశారు.
అల్పానా కిల్లావాలా
ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-17/1127 |