అక్టోబర్ 26, 2016
నకిలీ కరెన్సీ నోట్ల చలామణి - ప్రజలకు విజ్ఞప్తి
కొన్ని అసాంఘిక శక్తులు కొందరు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మన దేశానికి చెందిన ఎక్కువ విలువ కలిగిన నకిలీ కరెన్సీ నోట్లను సాధారణ కార్యకలాపాలలో భాగంగా చలామణిలోకి తెస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.
అందువల్ల మీరు తీసుకునే నోట్లను జాగ్తత్తగా పరిశీలించమని ప్రజలకు హెచ్చరిక జారీ చేయడమైనది. మన దేశ అసలైన కరెన్సీ నోట్లలో నకిలీలను అరికట్టేందుకు అనేక పటిష్టమైన భద్రతాంశాలున్నాయి. నకిలీ నోట్లను దగ్గర నుంచి పరిశీలించినట్లయితే వాటిని సులభంగా గుర్తు పట్టవచ్చు. బ్యాంకు నోట్లపై ఉన్న భద్రతాంశాల వివరాలను గురించి మా వెబ్ సైట్ https://paisaboltahai.rbi.org.in/ నుంచి తెలుసుకుని, వాటిని గురించి ఇతరులకు కూడా అవగాహన కల్పించవచ్చు. ప్రజలు తమ నిత్య వ్యవహారాలలో భాగంగా ఏవైనా నోట్లను స్వీకరించేముందు వాటిని జాగ్రత్తగా పరిశీలించడం అలవాటు చేసుకుని, నకిలీ బ్యాంకు నోట్ల చలామణిని నిరోదించడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
నకిలీ నోట్లను తయారు చేసినా, వాటిని కలిగి ఉన్నా, మార్చుకున్నా, స్వీకరించినా, చలామణి చేసినా లేదా అలాంటి చర్యలకు సహకరించినా అవి భారతీయ శిక్షా స్మృతి కింద నేరాలనీ, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు విధించబడతాయని రిజర్వ్ బ్యాంక్ అందరికీ గుర్తు చేస్తోంది.
భారతీయ బ్యాంకు నోట్లను పెద్ద సంఖ్యలో ఉపయోగించుకోవడానికి అవసరమైన అదనపు గుర్తింపు అవసరాల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆలోచిస్తోంది.
నకిలీ నోట్ల చలామణిని అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ తదితర సంస్థలకు సహకరించాలని రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
ఈ ప్రకటనను రిజర్వ్ బ్యాంక్ ప్రజల విస్తృత ప్రయోజనార్థం వారిని హెచ్చరించడానికి జారీ చేయడమైనది.
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1037 |