డిసెంబర్ 29, 2016
ఇంటాగ్లియో ముద్రణ, నిక్షిప్తమైన అక్షరం లేకుండా, నంబర్ ప్యానెళ్ళలోని
అంకెల పరిమాణం ఆరోహకక్రమంలో గల ₹ 20 బ్యాంక్ నోట్ల జారీ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో, రెండు నంబరు ప్యానెళ్ళలో నిక్షిప్తమైన అక్షరంలేని ₹ 20 బ్యాంక్ నోట్లను, మహాత్మా గాంధి సిరీస్-2005 లో, విడుదలచేయనుంది. ఈ నోట్లు, భారతీయ రిజర్వ్ బ్యాంక్, గవర్నర్, డా. ఉర్జిత్ పటేల్ సంతకంకలిగి, వెనుకవైపు, ముద్రించిన సంవత్సరం '2016' అని ముద్రణ కలిగి ఉంటాయి.
ఈ నోట్ల నమూనా, భద్రతా అంశాలు, ఇటీవల డిసెంబర్ 4, 2016 తేదీన పత్రికా ప్రకటన సం. 2016-2017/1402 ద్వారా మహాత్మా గాంధి సిరీస్- 2005 లో, రెండు నంబర్ ప్యానెళ్ళలో సంఖ్యలు ఆరోహక క్రమంలో ఉండి, ఇంటాగ్లియో ముద్రణ లేకుండా జారీచేసిన ₹ 20 బ్యాంక్ నోట్ల మాదిరిగానే ఉంటాయి.
గతంలో జారీచేసిన అన్ని ₹ 20 బ్యాంక్ నోట్లు, చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/1700 |