డిసెంబర్ 30, 2016
NBFC-MFI లు, జనవరి 01, 2017 త్రైమాసిక ఆరంభంనుండి వసూలు చేయడానికి
వర్తించే సగటు బేస్ రేట్ (Average Base Rate)
భారతీయ రిజర్వ్ బ్యాంక్, జనవరి 01, 2017 త్రైమాసికం ఆరంభం నుండి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సూక్ష్మ రుణ సంస్థలు (NBFC-MFI s) వసూలు చేయగల సగటు బేస్ రేట్ 9. 41 శాతంగా, ఈరోజు తెలియచేసింది.
రుణంయొక్క మూల్యం గురించి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు, సూక్ష్మ రుణ సంస్థలకు, రిజర్వ్ బ్యాంక్, ఫిబ్రవరి 7, 2014 న జారీచేసిన సర్క్యులర్ ద్వారా, ప్రతి త్రైమాసికంలో చివరి పనిరోజున, తదుపరి త్రైమాసికంలో NBFC-MFI లు రుణగ్రహీతలనుండి వసూలుచేయగల వడ్డీ రేట్ నిర్ణయించేందుకు వీలుగా, ఐదు అతిపెద్ద వాణిజ్య బ్యాంకుల సగటు బేస్ రేట్ ఆధారంగా తెలియచేస్తామని ప్రకటించింది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/1714 |