డిసెంబర్ 30, 2016
రిజర్వ్ బ్యాంక్‌చే శ్రీ సాయి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముఖేడ్, నాందేడ్ జిల్లా,
మహారాష్ట్ర యొక్క అనుమతి రద్దు
శ్రీ సాయి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, ముఖేడ్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర యొక్క అనుమతిని రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ఈ ఉత్తరువు, డిసెంబర్ 28, 2016 పనివేళల ముగింపు నుండి అమలులోకి వచ్చింది., మహారాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్‌ను, బ్యాంక్ మూసి వేయవలసిందిగా ఉత్తరువులు జారీ చేసి, లిక్విడేటర్‌ను నియమించవలసిందిగా కోరడం జరిగింది.
రిజర్వ్ బ్యాంక్, ఈక్రింది కారణాలవల్ల బ్యాంక్ యొక్క అనుమతి రద్దుచేసింది:
-
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 11 (1) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు)(AACS) క్రింద అవసరమైన కనీస మూలధన, నిల్వల (Minimum capital and reserves) నిబంధనలు బ్యాంక్ పాటించలేదు.
-
బ్యాంక్ కార్యకలాపాలు, ప్రస్తుత/ భావి డిపాజిటర్లకు, ప్రజలకు హానికరంగా మరియు బి ఆర్ ఏక్ట్, 1949, (AACS) సెక్షన్ 11, 22 (3) లను ఉల్లంఘించి నిర్వహించబడుతున్నాయి.
-
బ్యాంక్, ప్రస్తుత/భావి డిపాజిటర్లు కోరినప్పుడు, వారికి పూర్తిగా చెల్లింపు చేయగల స్థితిలో లేదు.
-
బ్యాంక్ ఆర్థిక పరిస్థితి పునరుద్ధరణకు అవకాశం ఏమాత్రం లేదు.
-
బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇకపై కొనసాగించడానికి అనుమతించినట్లయితే, ప్రజా హితానికి భంగం కలుగుతుంది.
అనుమతి రద్దుచేయబడిన కారణంగా, శ్రీ సాయి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముఖేడ్, నాందేడ్ జిల్లా, మహరాష్ట్ర, సెక్షన్ 5 (b), బి ఆర్ ఏక్ట్ 1949 (AACS) లో నిర్వచించిన బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడం తక్షణం నిషేధించబడినది.
అనుమతి రద్దు చేయబడి, లిక్విడేషన్ చర్యలు ప్రారంభమయిన కారణంగా, డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) ఏక్ట్, 1961, అనుసరించి శ్రీ సాయి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, ముఖేడ్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్రయొక్క, డిపాజిటర్లకు చెల్లింపు ప్రక్రియ మొదలవుతుంది. లిక్విడేషన్ పూర్తి అయిన పిదప ప్రతి డిపాజిటర్, డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) నుండి ₹ 1,00,000 (కేవలం లక్ష రూపాయిలు) పరిమితి వరకు, సామాన్య షరతులు/నిబంధనలను అనుసరించి, వారి డిపాజిట్ చెల్లింపునకు అర్హులౌతారు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/1722 |