డిసెంబర్ 28, 2016
రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా డా. విరల్ వి. ఆచార్య నియామకం
కేంద్ర ప్రభుత్వం తమ నోటిఫికేషన్ F.No. 7/1/2012/-BO-I (Pt), తేది డిసెంబర్ 28, 2016 ద్వారా, ఆర్థిక విభాగం, న్యూయార్క్ విశ్వ విద్యాలయం - స్టెమ్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రస్తుతం ఆర్థిక శాస్త్రంలో, సి. వి. స్టార్ ప్రొఫెసర్‌గా, (C.V. Starr Professor of Economics, Department of Finance, New York University – Stem School of Business) (రెజ్యూమే జతచేయబడింది) ఉన్న డా. విరల్ వి. ఆచార్యను, వారు పదవి చేపట్టిననాటినుంచి మూడు సంవత్సరాల కాలానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిప్యూటీ గవర్నర్‌గా నియమించింది. జనవరి 20, 2017 నుండి డా. ఆచార్య, విధుల్లో చేరతారు.
డిప్యూటీ గవర్నర్‌గా డా. ఆచార్య, ద్రవ్య విధాన పరిశోధనా విభాగ సమూహాలను పర్యవేక్షిస్తారు.
జోస్ జె. కత్తూర్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2016-2017/1685
|