జనవరి 04, 2017
అమానత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరుకు జారీ చేసిన నిర్దేశాల కాలపరిమితి
పొడిగించిన రిజర్వ్ బ్యాంక్
అమానత్ కో-ఆపరేటివ్ బ్యాంక్, బెంగళూరుకు ఏప్రిల్ 01, 2013 జారీ చేసిన నిర్దేశాల గడువు ఆ తదుపరి అదేశాల ద్వారా పొడిగించడం జరిగింది. (ఆఖరి ఆదేశం తేదీ జూన్ 29, 2016). ప్రజాహితం దృష్ట్యా, ఈ ఆదేశాలు మరొక ఆరు నెలల కాలం పొడిగించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిందని, ఇందుమూలముగా ప్రజలకు తెలియచేయడమైనది.
తదనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35 A ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, ఏప్రిల్ 01, 2013 న జారీ చేయబడి, అ తరువాత ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరి సారి జనవరి 04, 2017 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక ఆరు నెలల వరకు (అనగా జనవరి 5, 2017 నుండి జులై 4, 2017 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, అదేశించడం జరిగింది. ఈ ఆదేశాలు పునస్సమీక్షించ వచ్చు.
పైన పేర్కొన్న నిర్దేశంలోని ఇతర నియమ నిబంధనలలో మార్పు లేదు.
పైన చెప్పిన నిర్దేశాలు జారీ చేసినంతమాత్రాన, వారి బ్యాంకింగ్ లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసిందని భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. పరిస్థితులనిబట్టి రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/1774 |