డిసెంబర్ 26, 2016
రిజర్వ్ బ్యాంక్‌చే ద్రవ్యోల్బణం ముందస్తు అంచనాలకై
డిసెంబర్ 2016 విడత కుటుంబ సమూహాలలో సర్వే ప్రారంభం
రిజర్వ్ బ్యాంక్, నియమానుసారంగా ద్రవ్యోల్బణంపై ముందస్తు అంచనాల సర్వే నిర్వహిస్తుంది. డిసెంబర్ 2016 సర్వే, ప్రస్తుతం 18 నగరాల్లో మొదలుకాబోతోంది - అహమ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భుబనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గువహాతి, హైదరాబాద్, జైపూర్, కోల్కతా, లక్నో, ముంబయి, నాగ్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రాంచి మరియు తిరువనంతపురం. వచ్చే మూడునెలల్లో/ సంవత్సరంలో ధరలలో కలుగబోయే గుణాత్మకమైన (qualitative) మార్పులపైన (సామాన్య ధరలు, ప్రత్యేకవర్గ ఉత్పత్తుల ధరలు), మరియు ప్రస్తుత, రాబోయే మూడునెలల/సంవత్సర కాలంలో ధరలలో కలుగబోయే పరిమాణాత్మక (quantitative) మార్పులపై కుటుంబాలయొక్క ప్రతిస్పందన కనుగొనడం ఈ సర్వే యొక్క లక్ష్యం. విధాన రచనకు వినియోగపడే సమాచారం దీనిద్వారా లభ్యమౌతుంది. ద్రవ్యోల్బణ అంచనాలు, సర్వేలో చేర్చబడ్డ కుటుంబాలు వినియోగించే వస్తుసముదాయంపై అధారపడి ఉంటుంది.
M/S హంసా రిసెర్చ్ గ్రూప్ ప్రై. లి., ఈ విడత సర్వే నిర్వహించడానికి, రిజర్వ్ బ్యాంక్‌చే నియోగించబడింది. ఈ సంస్థ, ఎంపికచేయబడిన కుటుంబాలను సందర్శిస్తుంది. వారు కలిసినప్పుడు, ఆ కుటుంబాలు వారికి తమ స్పందన తెలియజేయవలసిందని మనవి. ఈ సంస్థ కలవకపోయినా ఇతర వ్యక్తులు కూడా, 'లింక్‌డ్ సర్వే షెడ్యూల్ (ఫార్మ్‌స్ – సర్వే) [(Linked survey schedule (Forms-Survey)] వినియోగించి, వారి స్పందన తెలియచేయవచ్చు. పూర్తి చేసిన సర్వే షెడ్యూల్, ఇ మైల్ ద్వారా ఈ క్రింద సూచించిన విధంగా పంపవచ్చు. ఏవేని సందేహాలకు/వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించండి:
ది డైరెక్టర్, డివిజన్ ఆఫ్ హౌస్‌హోల్డ్ సర్వేస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, C-8, 6 వ అంతస్తు, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, బాంద్రా (ఈస్ట్), ముంబై-400051; ఫోన్: 022-26578398, 022-26578332, ఫ్యాక్స్: 022-26571327. ఇ మైల్ పంపుటకు, ఇచ్చట నొక్కండి.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/1650 |