జనవరి 03, 2017
రిజర్వ్ బ్యాంక్‌చే ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్
బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్రపై జరిమానా విధింపు
మీ వినియోగదారుణ్ణి తెలిసికోండి (KYC)/ ఏంటీ మనీ లాండరింగ్ [(Anti-money laundering (AML)] అంశాలకు సంబంధించి, తమ ఆదేశాలు/నిర్దేశాలు/సూచనలు ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47 A (1)(b) మరియు సెక్షన్ 46(4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల అనుసారంగా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ముంబై, మహారాష్ట్రపై, ₹ 1 లక్ష (కేవలం ఒక లక్షరూపాయిలు) నగదు జరిమానా విధించింది.
రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా మరియు మౌఖికంగా జవాబు ఇచ్చింది. బ్యాంక్ ఇచ్చిన జవాబు, దీనికి సంబంధించి అన్ని ఇతర అంశాలు పరిశీలించిన పిమ్మట, బ్యాంక్ యొక్క ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి జరిమానా విధించదగ్గవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చింది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/1748 |