జనవరి 03, 2017
రిజర్వ్ బ్యాంక్ క్రొత్త ED గా శ్రీమతి సురేఖ మరాండి నియామకం
డిసెంబర్ 31, 2016 న శ్రీ యు. ఎస్. పాలివాల్ పదవీ విరమణతో రిజర్వ్ బ్యాంక్, శ్రీమతి సురేఖా మరాండిని ఎక్జెక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. శ్రీమతి మరాండి, జనవరి 2, 2017 తేదీన బాధ్యతలు చేపట్టారు.
ఎక్జెక్యూటివ్ డైరెక్టర్‌గా శ్రీమతి మరాండి, వినియోగదారుల శిక్షణ మరియు సంరక్షణ విభాగం (Consumer Education and Protection Department), ఆర్థిక సంఘటితము మరియు వికాస విభాగము (Financial Inclusion and Development Department), సెక్రటరీస్ విభాగాలను (Secretary’s Department) పర్యవేక్షిస్తారు. వీరు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా బోర్డులలోకూడా సేవలందించారు.
ఎక్జెక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతికి ముందు, శ్రీమతి మరాండి, రిజర్వ్ బ్యాంక్‌లో ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా పనిచేశారు. రిజర్వ్ బ్యాంక్‌లో, నియంత్రణ, పర్యవేక్షణ, ఆర్థిక సంఘటితము, మానవ వనరుల నిర్వహణ, వికాసం, మొదలైన క్షేత్రాలలో ముప్ఫై సంవత్సరాలకాలం వీరు సేవలందించారు. శ్రీమతి మరాండి, జాధవ్‌పూర్ విశ్వ విద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుఏట్ పట్టా కలిగి ఉన్నారు.
అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/1757 |