మార్చి 30, 2017
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) సెక్షన్ 35 A క్రింద జారీ చేసిన సూచనలు -
అజింక్యతార సహకారి బ్యాంక్ లిమిటెడ్, సతారా, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని సతారాకు చెందిన అజింక్యతార సహకారి బ్యాంక్ లిమిటెడ్ ను బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35 A క్రింద సెప్టెంబర్ 28, 2015న జారీ చేసిన ఆదేశాలను అనుసరించి సెప్టెంబర్ 30, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుండి ఉత్తర్వుల క్రింద ఉంచడం జరిగింది. ఆ ఉత్తరువులను ఎప్పటికప్పుడు తదనంతర ఆదేశాల ద్వారా పొడిగించడం జరిగింది. అట్టి చివరి ఆదేశాలను సెప్టెంబర్ 28, 2016న జారీ చేయగా, అవి మార్చి 30, 2017 వరకు, సమీక్షకు లోబడి, కొనసాగాయి.
ప్రజలకు తెలియజేయడం ఏమనగా, సతారాలోని అజింక్యతార సహకారి బ్యాంక్ లిమిటెడ్ కు సెప్టెంబర్ 28, 2015న విడుదల చేసిన ఆదేశాలను మార్చి 20, 2017న విడుదల చేసిన ఆదేశానికి అనుగుణంగా మరో ఆరునెలల పాటు అనగా సెప్టెంబర్ 30, 2017 వరకు, సమీక్షకు లోబడి, పొడిగించడమైనది.
పైన పేర్కొన్న ఉత్తరువులకు చెందిన ఇతర నియమ నిబంధనలలో ఎలాంటి మార్పూ ఉండదు.
ప్రజల పరిశీలనార్థం మార్చి 20, 2017న జారీ చేసిన ఉత్తరువుల కాపీని బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించడం జరుగుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు చేసిన ఆ మార్పును అనుసరించి ఆ బ్యాంకు యొక్క ఆర్థిక పరిస్థితి చెప్పుకోదగినంతగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందిందని భావిస్తున్నట్లుగా పరిగణించరాదు.
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్: 2016-17/2617 |