Note : To obtain an aligned printout please download the (53.00 kb ) version to your machine and then use respective software to print the story. |
Date: 11/04/2017 | M/s శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ కు జరిమానా విధించిన RBI |
ఏప్రిల్ 11, 2017
M/s శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ కు జరిమానా విధించిన RBI
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తనకు RBI యాక్ట్, 1934లోని సెక్షన్ 58G (1) (b) రెడ్ విత్ సబ్ సెక్షన్ 5 (aa) ఆఫ్ సెక్షన్ 58B క్రింద రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలను/సూచనలను ఉల్లంఘించినందుకు గాను M/s శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ద కంపెనీ) కు రూ.20 లక్షల జరిమానా విధించినది.
నేపథ్యం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934 (ద RBI యాక్ట్. 1934)లోని సెక్షన్ 45N క్రింద నవంబర్, 2015లో సదరు కంపెనీ యొక్క కొన్ని రుణాల అకౌంట్లను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో RBI యాక్ట్. 1934 లోని సెక్షన్ 45L లోని వివిధ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లుగా గుర్తించడం జరిగింది. RBI నిబంధనలను పలు చోట్ల ఉల్లంఘించినట్లు వెల్లడి కావడంతో ఆ కంపెనీకి ఆగస్టు 1, 2016న జరిమానా విధింపుపై షోకాజ్ నోటీసును జారీ చేయడం జరిగింది. అయితే ఆ కంపెనీ ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేదు. సదరు కంపెనీకి ఫిబ్రవరి 14, 2017న RBI యాక్ట్. 1934 లోని సెక్షన్ 58G (2) కింద వ్యక్తిగత వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించబడింది. ఈ కేసులోని వాస్తవాలను పరిశీలించి, సదరు కంపెనీ యొక్క సమాధానాన్ని పరిశీలించిన పిమ్మట, అంతే కాకుండా వ్యక్తిగత వివరణలో వారిచ్చిన సమాధానాలను విన్న తర్వాత, తనఖీల సందర్భంగా బయటపడిన నిబంధనల ఉల్లంఘన వాస్తవమే అనే నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో RBI తనకు సంక్రమించిన అధికారాలను అనుసరించి ఆ కంపెనీకి రూ. 20 లక్షల జరిమానా విధించడం జరిగింది.
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్: 2016-17/2742 |
|
|
|