ఏప్రిల్ 18, 2017
పర్యవేక్షణా సహకారం, పర్యవేక్షణ సమాచార మార్పిడిపై రాయల్ మానిటరీ
అథారిటీ, భూటాన్‌తో అవగాహన ఒప్పందం (Memorandum of
Understanding, MoU) సంతకం చేసిన రిజర్వ్ బ్యాంక్
భారతీయ రిజర్వ్ బ్యాంక్, పర్యవేక్షణా సహకారం మరియు పర్యవేక్షణా సమాచార బదిలీపై (Supervisory Co-operation and Exchange of Supervisory Information), రాయల్ మానిటరీ అథారిటీ, భూటాన్‌తో అవగాహనా ఒప్పందం (MoU) సంతకం చేసింది.
ఈ ఒప్పందంమీద, రాయల్ మానిటరీ అథారిటీ తరఫున, వారి డెప్యూటీ గవర్నర్ శ్రీ ఫాజో దోర్జీ; భారతీయ రిజర్వ్ బ్యాంక్ తరఫున, డెప్యూటీ గవర్నర్ శ్రీ ఎస్ ఎస్ ముంద్రా సంతకాలు చేశారు.
పర్యవేక్షణలో సహకారం మరియు పర్యవేక్షణా సమాచార మార్పిడి మరింత మెరుగు పరచడం కోసం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని దేశాల పర్యవేక్షకులతో, అవగాహనా ఒప్పందాలు (MoU), పర్యవేక్షణా సహకార పత్రం (Letter for Supervisory Co-operation), సహకార ప్రతిపాదన (Statement of Co-operation) ఒప్పందాలు కుదుర్చుకొంది. ఈ MoU తో కలిపి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటువంటి MoU లు 39, ఒక పర్యవేక్షణా సహకార పత్రం, ఒక సహకార ప్రతిపాదనపై సంతకాలు చేసింది.
అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/2808 |