ఏప్రిల్ 18, 2017
రిజర్వ్ బ్యాంక్‌చే జమ్ములో బ్యాంకింగ్
ఆంబుడ్జ్‌మన్ కార్యాలయం ప్రారంభం
ఇటీవలి కాలంలో గణనీయంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరుగుట, ప్రస్తుత న్యూ దిల్లీ – I బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ పరిధి అతిగా విస్తరించుట దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్, జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రం కోసం, రిజర్వ్ బ్యాంక్, జమ్ములో, బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ కార్యాలయం నెలకొల్పింది.
ఇంతవరకు బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ కార్యాలయం, న్యూ దిల్లీ – I, పరిధిలో ఉన్న పూర్తి జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రం, ఇకపై బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ కార్యాలయం, జమ్ము పరిధిలోకి వస్తుంది.
అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/2807 |