ఏప్రిల్ 26, 2017
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండు ఆథరైజ్డ్ డీలర్ బ్యాంకులపై
నగదు జరిమానా విధించినది
FEMA 1999 క్రింద పాటించవలసిన నివేదికా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఈ క్రింద తెలిపిన రెండు బ్యాంకులపై నగదు జరిమానా విధించినది. జరిమానా వివరాలు:
క్రమ సంఖ్య |
బ్యాంకు పేరు |
జరిమానా మొత్తం
₹ |
1. |
ది హంగ్‌కాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ |
70,000 |
2. |
కోటక్ మహీంద్రా బ్యాంక్ |
10,000 |
రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన సూచనలు/ఆదేశాలు/మార్గదర్శాకాల ఉల్లంఘనలు పరిగణనలోకి తీసుకొని, సెక్షన్ 11(3), FEMA 1999 ద్వారా రిజర్వ్ బ్యాంకుకు దఖలుపరచబడిన అధికారాలతో ఈ జరిమానాలు విధించడంజరిగింది.
ఈ బ్యాంకులకు, రిజర్వ్ బ్యాంక్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వీటికి, బ్యాంకులు లిఖిత పూర్వకంగా జవాబులు, మౌఖిక నివేదనలు సమర్పించినవి. ఈ విషయంలో నిజానిజాలు, బ్యాంకులు సమర్పించిన జవాబులు, పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చింది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/2896 |