Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (102.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 27/03/2017
ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ (FATF) - ఫిబ్ర‌వ‌రి 24, 2017 నాటి బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌

మార్చి 27, 2017

ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ (FATF) - ఫిబ్ర‌వ‌రి 24, 2017 నాటి బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌

ఉత్త‌ర కొరియా (DPRK) వైపు నుంచి వ‌చ్చి ప‌డుతున్న‌ మ‌నీ లాండ‌రింగ్ మ‌రియు ఆర్థిక ఉగ్ర‌వాదం (ML/FT) త‌దిత‌ర ప్ర‌మాదాల నుంచి అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిర‌క్ష‌ణ కోసం త‌గిన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ త‌న స‌భ్యుల‌ను మ‌రియు త‌న ప‌రిధిలోని ఇత‌ర సంస్థ‌ల‌ను కోరుతోంది. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ప్ర‌మాదాల దృష్ట్యా కూడా స‌భ్య దేశాలు త‌గిన భద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాలని FATF హెచ్చ‌రిస్తోంది. ఈ క్రింది దేశాల‌లో కూడా వ్యూహాత్మ‌క లోపాలు ఉన్న‌ట్లు గుర్తించిన FATF వాటిని తొల‌గించ‌డానికి ఒక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించ‌డం జ‌రిగింది. ఆ దేశాలు: ఆఫ్ఘ‌నిస్తాన్‌, బోస్నియా అండ్ హెర్జ‌గోవినా, ఇథియోపియా, ఇరాక్, లావో పీడీఆర్‌, సిరియా, ఉగాండా, వ‌నువాటు, యెమన్‌.

దీనికి సంబంధించిన స‌మాచారం FATF ఫిబ్ర‌వ‌రి 24, 2017న విడుద‌ల చేసిన అప్ డేట్ చేసిన బ‌హిరంగ ప్ర‌క‌ట‌న మ‌రియు ప‌త్రంలో ల‌భ్య‌మ‌వుతుంది. ఈ ప్ర‌క‌ట‌న మ‌రియు ప‌త్రాన్ని ఈ క్రింది URL ద్వారా వీక్షించ‌వ‌చ్చు:

1) http://www.fatf-gafi.org/publications/high-riskandnon-cooperativejurisdictions/documents/public-statement-february-2017.html మ‌రియు

2) http://www.fatf-gafi.org/publications/high-riskandnon-cooperativejurisdictions/documents/fatf-compliance-february-2017.html

యాంటీ మ‌నీ లాండ‌రింగ్(AML)/ ఆర్థిక‌ ఉగ్ర‌వాద వ్య‌తిరేక పోరాటం (CFT) ల‌లోని లొసుగులు క‌లిగిన దేశాల‌ను గుర్తించి, వాటితో క‌లిసి ప‌ని చేసే చ‌ర్య‌ల్లో భాగంగా, FATF ప్లీన‌రీ ‘ఇంప్రూవింగ్ గ్లోబ‌ల్ AML/CFT కాంప్ల‌యెన్స్‌: ఆన్-గో్యింగ్ ప్రాసెస్’ పేరిట వ్యూహాత్మ‌క AML/CFT లోపాలు క‌లిగిన దేశాల‌పై ఒక బ‌హిరంగ ప్ర‌క‌ట‌న మ‌రియు ప‌త్రాన్ని విడుద‌ల చేసింది. ఆ ప్ర‌క‌ట‌న మ‌రియు ప‌త్రం FATF వెబ్ సైట్‌లో ల‌భ్య‌మ‌వుతాయి. అలాంటి స‌ల‌హాలు, సూచ‌న‌లు నియంత్రిత సంస్థ‌లు ఇక్క‌డ పేర్కొన్న దేశాలు లేదా అధికార‌ప‌రిధిలోని ప్రాంతాల‌తో చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను నిర్వహించుటకు ఆటంకాలు కాజాల‌వు.

ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ (FATF) 1989లో స‌భ్య‌దేశాల మంత్రులు క‌లిసి ఏర్పాటు చేసుకున్న ఒక ప్ర‌భుత్వాంత‌ర కార్య‌నిర్వాహ‌క‌వ‌ర్గం. అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్ర‌మాదంగా ప‌రిణ‌మించిన మ‌నీ లాండ‌రింగ్‌, ఆర్థిక ఉగ్ర‌వాదం త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవ‌డంలో త‌గిన ప్ర‌మాణాల‌ను నెల‌కొల్ప‌డం, చ‌ట్ట‌ప‌ర‌మైన‌, నియంత్ర‌ణాప‌ర‌మైన‌, నిర్వ‌హ‌ణాప‌ర‌మైన ప‌రిష్కారాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌డాన్ని FATF ప్రోత్స‌హిస్తుంది. త‌న సభ్య దేశాలు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో సాధించిన పురోగ‌తిని స‌మీక్షించి, మ‌నీ లాండ‌రింగ్ మ‌రియు ఆర్థిక ఉగ్ర‌వాద మోసాల‌ను, వాటికి నివార‌ణ చ‌ర్య‌ల‌ను ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షిస్తూ, వాటిని అంత‌ర్జాతీయంగా అమ‌లు చేయ‌డంలో త‌గిన కృషి చేస్తుంది. FATF యొక్క నిర్ణ‌యాత్మ‌క కార్య‌నిర్వాహ‌క వ‌ర్గం, FATF ప్లీన‌రీ ఏడాదికి మూడుసార్లు స‌మావేశ‌మై, ఈ ప్ర‌క‌ట‌న‌ల‌ను సంస్క‌రిస్తుంది.

అజిత్ ప్ర‌సాద్
స‌హాయ స‌ల‌హాదారు

ప్రెస్ రిలీజ్ : 2016-2017/2585

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….