మార్చి 22, 2017
‘‘సూపర్ వైజరీ సహకారం మరియు సూపర్ వైజరీ సమాచార మార్పిడి’’ పై బ్యాంక్ ఆఫ్ థాయ్ ల్యాండ్ తో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన ఆర్ బీ ఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘‘సూపర్ వైజరీ సహకారం మరియు సూపర్ వైజరీ సమాచార మార్పిడి’’ పై బ్యాంక్ ఆఫ్ థాయ్ ల్యాండ్ తో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఈ అవగాహనా ఒప్పందంపై బ్యాంక్ ఆఫ్ థాయ్ ల్యాండ్ తరపున శ్రీ డాక్టర్ వీరతాయ్ శాంతిప్రభొ భు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ ఆర్. పటేల్‌లు సంతకాలు చేశారు.
సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి మరియు సూపర్ వైజరీ సమాచారాన్ని పంచుకొనేందకు రిజర్వ్ బ్యాంక్ పలు దేశాలతో అవగాహనా ఒప్పందాలు, సూపర్ వైజరీ సహకార లేఖలు మరియు సూపర్ వైజర్ల సహకార ప్రకటనలపై పలు ఒప్పందాలు కుదుర్చుకొన్నది. దీంతో ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి 38 అవగాహనా ఒప్పందాలు, ఒక సూపర్ వైజరీ సహకార లేఖ మరియు ఒక సహకార ప్రకటనలపై సంతకాలు చేసినట్లయింది.
అజిత్ ప్రసాద్ సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్: 2016-2017/2531
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….