ఏప్రిల్ 01, 2017 నుంచి SBI శాఖలుగా పని చేయనున్న భారతీయ మహిళా బ్యాంక్ శాఖలు |
మార్చి 22, 2017
ఏప్రిల్ 01, 2017 నుంచి SBI శాఖలుగా పని చేయనున్న
భారతీయ మహిళా బ్యాంక్ శాఖలు
ఏప్రిల్ 01, 2017 నుంచి భారతీయ మహిళా బ్యాంక్ కు చెందిన అన్ని శాఖలు SBI శాఖలుగా పని చేయనున్నాయి. ఏప్రిల్ 01, 2017 నుంచి ఖాతాదారులు మరియు భారతీయ మహిళా బ్యాంక్ కు చెందిన ఖాతాదారులు మరియు డిపాజిటర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులుగా పరిగణించబడతారు.
భారత ప్రభుత్వము భారతీయ మహిళా బ్యాంక్ స్వాధీన ప్రకటన 2017ను జారీ చేసినది. భారతీయ మహిళా బ్యాంక్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1955 (23 ఆఫ్ 1955) సబ్ సెక్షన్ (2) ఆఫ్ సెక్షన్ 35కు లోబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్వాధీనపరుస్తూ భారత ప్రభుత్వం ఫిబ్రవరి 20, 2017న జారీ చేసిన ఆదేశాలను భారత గెజిట్ లోని ఎక్స్ ట్రార్డినరీ పార్ట్ –II సెక్షన్ 3- సబ్ సెక్షన్ (i) లో ప్రచురించడం జరిగినది.
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్: 2016-2017/2535 |
|