| మార్చి 25, 2017 నుండి ఏప్రిల్ 01, 2017 వరకు RBI కు చెందిన అన్ని సంస్థాగత బ్యాంకులు మరియు ఎంపిక చేయబడిన కార్యాలయాలు తెరిచి ఉంచబడును |
మార్చి 24, 2017
మార్చి 25, 2017 నుండి ఏప్రిల్ 01, 2017 వరకు RBI కు చెందిన అన్ని సంస్థాగత బ్యాంకులు మరియు ఎంపిక చేయబడిన కార్యాలయాలు తెరిచి ఉంచబడును.
ప్రభుత్వ చెల్లింపులు మరియు స్వీకరణ కార్యకలాపాల నిమిత్తం ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే సంస్థాగత బ్యాంకులకు చెందిన అన్ని శాఖలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని అన్ని రోజులలో మరియు ఏప్రిల్ 01, 2017న (శనివారాలు, ఆదివారాలు మరియు అన్ని సెలవు దినాలలో) తెరిచి ఉంచాలని సూచించబడమైనది.
ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే RBIకు చెందిన అన్ని సంబంధిత శాఖలు కూడా పైన పేర్కొన్న రోజులలో తెరిచి ఉంచబడతాయి.
అల్పనా కిల్లావాలా
ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్: 2016-2017/2564
|
|