ఏప్రిల్ 13, 2017
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని జంఖేడ్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పై
ఆదేశాలను కొనసాగించిన ఆర్ బీ ఐ
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని జంఖేడ్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ను ఏప్రిల్ 07, 2016న జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఏప్రిల్ 16, 2016న వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుండి ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది. ఆ గడువును అక్టోబర్ 06, 2016న జారీ చేసిన ఆదేశాలను అనుసరించి అక్టోబర్ 13, 2016 నుండి ఏప్రిల్ 12, 2017 వరకు ఆరు నెలల పాటు పొడిగించడం జరిగింది. పైన పేర్కొన్న ఆదేశాల గడువును ఏప్రిల్ 06, 2017న జారీ చేసిన ఆదేశానుసారం మరోసారి జూన్ 12, 2017 వరకు రెండు నెలల పాటు, సమీక్షకు లోబడి, పొడిగించడం జరిగింది.
పైన పేర్కొన్న ఆదేశాలకు చెందిన ఇతర నియమ నిబంధనలలో ఎలాంటి మార్పూ ఉండదు.
ప్రజల పరిశీలనార్థం గడువు పొడిగింపు మరియు ఆదేశాలలో మార్పుల వివరణపై ఏప్రిల్ 06, 2017న జారీ చేసిన ఆ ఆదేశాల కాపీని బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించడం జరుగుతుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంకు చేసిన ఆ మార్పును అనుసరించి ఆ బ్యాంకు యొక్క ఆర్థిక పరిస్థితి చెప్పుకోదగినంతగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందిందని భావిస్తున్నట్లుగా పరిగణించరాదు.
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్: 2016-17/2776 |