ఏప్రిల్ 17, 2017
లక్నోలోని HCBL కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు జారీ చేసిన
ఆదేశాలను పొడిగించిన RBI
భారతీయ రిజర్వ్ బ్యాంక్ లక్నోలోని HCBL కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు జారీ చేసిన ఆదేశాలను ఏప్రిల్ 16, 2017 నుండి అక్టోబర్ 15, 2017 వరకు ఆరు నెలల పాటు, సమీక్షకు లోబడి, పొడిగించింది. ఈ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35A క్రింద ఏప్రిల్ 10, 2015న జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఏప్రిల్ 16, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుండి ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది. మార్పు చేసిన ఆదేశాలతో ఆ గడువును ఏప్రిల్ 15, 2017 వరకు పొడిగించడం జరిగింది. ఇవే గడువును ఏప్రిల్ 10, 2017న జారీ చేసిన ఆదేశాలను అనుసరించి అక్టోబర్ 15, 2017 వరకు పొడిగించడం జరిగింది. పైన పేర్కొన్న ఆదేశాలకు చెందిన ఇతర నియమ నిబంధనలలో ఎలాంటి మార్పూ ఉండదు. ప్రజల పరిశీలనార్థం ఏప్రిల్ 10, 2017న జారీ చేసిన ఆ ఆదేశాల కాపీని బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించడం జరుగుతుంది.
పరిస్థితులను బట్టి పై ఆదేశాలలో మార్పు చేసే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తుంది.
అజిత్ ప్రసాద్
సహాయ సలహాదారు
ప్రెస్ రిలీజ్: 2016-2017/2793 |