| Au స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వ్యాపార వ్యవహారాలు ప్రారంభం |
ఏప్రిల్ 19, 2017
Au స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వ్యాపార వ్యవహారాలు ప్రారంభం
Au స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చిన్న ఆర్థిక బ్యాంకుగా (Small Finance Bank) తమ వ్యాపార వ్యవహారాలు ఏప్రిల్ 19, 2017 నుండి ప్రారంభించింది. ఈ బ్యాంకుకు, చిన్న ఆర్థిక బ్యాంకుగా వ్యాపారం చేయడానికి, సెక్షన్ 22(1), బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, క్రింద రిజర్వ్ బ్యాంక్ అనుమతి జారీ చేసింది.
సెప్టెంబర్ 16, 2015 తేదీ పత్రికా ప్రకటనలో తెలిపినట్లుగా, చిన్న ఆర్థిక బ్యాంకులు నెలకొల్పడానికి అనుమతి జారీచేయబడ్డ పదిమంది దరఖాస్తుదారులలో, Au ఫైనాన్సియర్స్ లిమిటెడ్, జైపూర్, ఒకటి.
అనిరుద్ధ డి జాధవ్
అసిస్టెంట్ మానేజర్
పత్రికా ప్రకటన: 2016-2017/2832 |
|