ఏప్రిల్ 28, 2017
ప్రభుత్వ గోల్డ్ బాండ్లు - డీమటీరియలైజేషన్ (Soveriegn Gold Bonds - Dematerialisation)
రిజర్వ్ బ్యాంక్, భారత ప్రభుత్వంతో సంప్రదించి, ఇప్పటివరకు ఏడు విడతల్లో, ₹ 4800 కోట్ల విలువకు ప్రభుత్వ గోల్డ్ బాండ్లు జారీచేసింది. మదుపరులు, వారి అభిమతం మేరకు బాండ్లను భౌతికంగా గాని, డీమటీరియలైస్డ్ రూపం లో గాని, ఉంచుకొనే సదుపాయం కల్పించింది.
డీమటీరియలైజేషన్ కొరకై వచ్చిన విజ్ఞప్తులపై, చాలావరకు, విజయవంతంగా చర్య తీసుకోబడింది. అయితే, కొన్ని విజ్ఞప్తులపై, పేర్లు మరియు PAN నంబర్లలో తేడాలవల్ల, డీమ్యాట్ ఖాతాలు అచేతనంగా లేదా మూసివేయబడి ఉండడం వల్ల, తదితర కారణాలవల్లా, చర్య తీసికొనబడలేదు. అటువంటి విజ్ఞప్తుల జాబితా ఇప్పుడు వెబ్‌సైట్ https://sovereigngoldbonds.rbi.org.in లో ఉంచబడినది. ఈ సమాచారం విడతల వారీగా, స్వీకరించిన కార్యాలయం (Receiving Office), మదుపరుల గుర్తింపు (Investoer ID) మరియు బాండ్ డీమటీరియలైజేషన్ చేయలేకపోవడానికి కారణాలతో సహా ఇవ్వబడినది. ఈ జాబితా చూసి, మదుపరులు, వారి మదుపరుల గుర్తింపు (Investor ID) దీనిలో ఉన్నదేమో తెలిసికోవచ్చు. అన్ని రిసీవింగ్ కార్యాలయాలు, వారి ఖాతాదార్లకు చెందిన సమాచారం తెలిసికొని, వారితో చర్చించి, తగిన సవరణలు చేయవలెను. సవరణలకై, రిజర్వ్ బ్యాంక్, ఇ-కుబేర్ విండో (modification window in the e-Kuber application of the Reserve Bank of India) తెరిచి ఉంటుంది.
ఈ మధ్య సమయంలో నెలకొన్న అనిశ్చిత స్థితిలోకూడా, ప్రభుత్వ గోల్డ్ బాండ్లు, రిజర్వ్ బ్యాంక్ పుస్తకాల్లో చూపబడి, నియమానుసారంగా సేవలకు అర్హమౌతాయని తెలియచేస్తున్నాము.
అనిరుద్ధ డి జాధవ్
అసిస్టెంట్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2016-2017/2928 |