భారత ప్రభుత్వము
ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక వ్యవహారాల విభాగం
న్యూఢిల్లీ,
ఏప్రిల్ 19, 2017
నోటిఫికేషన్
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ డిపాజిట్ పథకానికి సవరణ, నోటిఫికేషన్ నెం. S.O.4061 E
1. S.O. - ఫైనాన్స్ చట్టం, 2016 (28 ఆఫ్ 2016)లోని (ఇకపై ఇది చట్టంగా పేర్కొనబడుతుంది) క్లాజ్ (C) ఆఫ్ సెక్షన్ 199B ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి, కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 16, 2016న ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ డిపాజిట్ పథకానికి సంబంధించి జనవరి 19, 2017న నోటిఫికేషన్ నెం. S.O. 204(E) ద్వారా సవరించిన, ఆ తర్వాత మళ్లీ ఫిబ్రవరి 07, 2017న నోటిఫికేషన్ నెం. S.O. 365 (E) ద్వారా సవరించిన నోటిఫికషన్ నెం. S.O.4061 (E) లోని క్లాజ్ 5లోని నిబంధనలకు ఈ క్రింది సవరణలు చేస్తోంది.
2. ఒరిజినల్ నోటిఫికేషన్ లోని క్లాజ్ 5 స్థానంలో ఈ క్రింది దానిని ప్రత్యామ్నాయంగా పెట్టుకొనవచ్చును.
‘’5. అధికారిక డేట్ ఆఫ్ డిపాజిట్ - రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడైతే అధీకృత బ్యాంకుల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తుందో, ఆ తేదీయే బాండ్ల లెడ్జర్ అకౌంట్ తెరిచే తేదీ అవుతుంది; బాకీ పడిన పన్నులు, సర్ చార్జ్ మరియు జరిమానాను మార్చి 31, 2017 వరకు స్వీకరించడం జరుగుతుంది; ఎట్టి పరిస్థితులలోనూ డిపాజిట్ చేసే తేదీని ఏప్రిల్ 30, 2017కన్నా ముందుకు పొడిగించడం జరగదు.’’ |