RBI/2016-17/292
FIDD.CO.LBS.BC.No.28/02.08.001/2016-17
ఏప్రిల్ 27, 2017
ద చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్లు
అన్ని లీడ్ బ్యాంకులు
డియర్ సర్/మేడమ్,
హర్యానా రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటు - లీడ్ బ్యాంక్ బాధ్యతల కేటాయింపు
హర్యానా ప్రభుత్వం డిసెంబర్ 1, 2016న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా హర్యానా రాష్ట్రంలో ‘చర్కి దాద్రి’ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫై చేసింది. ఈ క్రింద పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కొత్త జిల్లా యొక్క లీడ్ బ్యాంక్ బాధ్యతలను పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కేటాయించడం జరిగింది:
| క్రమ సంఖ్య |
కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా |
గతంలో ఉన్న జిల్లా |
కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కింద ఉన్న సబ్ డివిజన్ |
లీడ్ బ్యాంక్
బాధ్యత కేటాయించిన బ్యాంకు |
కొత్త జిల్లాకు కేటాయించిన జిల్లా వర్కింగ్ కోడ్ |
| 1. |
భివాని |
భివాని |
భివాని, లోహారు, సివానీ, తోషమ్ |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ |
359 |
| 2. |
చర్కి దాద్రి |
భివాని |
భద్ర, చర్కి దాద్రి |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ |
395 |
2. దీనికి తోడు, పైన చూపిన పట్టికలో పేర్కొన్నట్లుగా, బ్యాంకులు చేసే BSR రిపోర్టింగ్ కొరకు కొత్త జిల్లాకు జిల్లా వర్కింగ్ కోడ్ ను కేటాయించడం జరిగింది.
3. హర్యానా రాష్ట్రంలోని ఇతర జిల్లాల లీడ్ బ్యాంకు బాధ్యతల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులూ లేవు.
మీ విశ్వసనీయులు,
(అజయ్ కుమార్ మిశ్రా)
చీఫ్ జనరల్ మేనేజర్ |