ఏప్రిల్ 1, 2010
ఆర్.బీ.ఐ ఎట్ 75 (RBI at 75): ప్రధానమంత్రి గారిచే స్మారక నాణేల సెట్; ఆర్థిక మంత్రి గారిచే
‘మింట్ రోడ్ మైల్స్టోన్స్’ ల విడుదల
ఛాయాచిత్రం
“శీఘ్రగతిన మరియు సమ్మిళిత వృద్ధిని సాధించాలనే మన లక్ష్యo నెరవేరడానికి. మన ద్రవ్య మరియు ఆర్దిక విధానాలు మూడు లక్ష్యాలచే మార్గనిర్దేశం చేయబడాలి. మొట్టమొదటగా, అవి ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉండేట్లు చూడాలి, ఎందుచేతనంటే ఇది సామాన్య మానవుణ్ణి పలు ఇబ్బుందులకు గురి చేస్తుంది అంతేగాకుండా ఆర్దిక సంకేతాలు వక్రీకరింపబడతాయి. రెండవది, బ్యాంకింగ్ మరియు ఆర్దిక రంగాలు నిలకడగా ఉండేట్లు చూడాలి, లేనియెడల ఆర్దిక సంక్షోభానికి గురై తద్వారా అధిక మూల్యం విధింపబడుతుంది. మూడవది, అవి శీఘ్రగతిన సమ్మిళిత వృద్ధి కోసం ఆర్దిక మధ్యవర్తిత్వ అవసరాలను తీర్చగలగాలి.” ఇది ఏప్రిల్ 01, 2010 వ తేదీన ‘సజీవ కళల జాతీయ కేంద్రం’, ముంబై లో నిర్వహించబడిన రిజర్వ్ బ్యాంక్ ప్లాటినం జయంతి ముగింపు ఉత్సవంలో ముఖ్య అతిధి మాననీయ భారత ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన కీలక సందేశం. రిజర్వ్ బ్యాంక్ తన 75 సంవత్సారాల ఉనికిలో దేశానికి విశిష్ట సేవలు అందిస్తున్నందులకు మెచ్చుకుంటూ, బ్యాంకింగ్ ఏజెంట్ల వ్యవస్థ అభివృద్ధికై అనుకూల పరిస్థితులు కల్పించడం లో రిజర్వ్ బ్యాంకు గణనీయమైన చొరవ చూపిందని ప్రధాన మంత్రి గారు అన్నారు. బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృత పరిచేందుకు, రిజర్వ్ బ్యాంక్ కట్టుబడి యుండాలి, అందువల్ల బ్యాంకులు అత్యధిక ప్రజల జీవితాలను స్పృశించగలుగుతాయని వారు వక్కాణించారు.
గౌరవ అతిథులైన మాననీయ కేంద్ర ఆర్దికమంత్రి వర్యులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, His Excellency గవర్నర్ అఫ్ మహారాష్ట్ర శ్రీ కే. శంకర నారాయణన్ గారు, మాననీయ మహారాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ అశోక్ చవాన్ గారు; మాజీ గవర్నర్ మరియు రిజర్వ్ బ్యాంకు కార్యనిర్వాహక వర్గము, బ్యాంకులు మరియు ఆర్ధిక సంస్థల సీనియర్ కార్యనిర్వాహక వర్గo; ప్రభుత్వ సీనియర్ ఆఫీసర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు మరియు ప్రపంచ ప్రఖ్యాతి ఆర్ధిక వేత్తలు ఈ సందర్భంగా వేడుకలను అలరించారు. రిజర్వ్ బ్యాంక్ సీనియర్ అధికారులు కూడా విచ్చేశారు.
దేశ కేంద్రీయ (సెంట్రల్) బ్యాంకుగా, రిజర్వ్ బ్యాంకు ఏప్రిల్ 1st, 1935 తేదీన స్థాపించబడి, 2009-2010 ను ప్లాటినం జయంతి సంవత్సరంగా జరుపుకుంటున్నది. సంవత్సరం పొడుగునా జరిగే ఈ వేడుకలలో భాగంగా అనేక ప్రదర్శనల సరణి సమేతమయింది; అందులో రిజర్వ్ బ్యాంకు ను ప్రావీణ్యం గల సంస్థ గా ఎఱుకపరచే ఈవెంట్లు, అంతర్గతంగా ఉద్యోగులనందరినీ మాజీ లతో సహా కలుపుకొని రిజర్వ్ బ్యాంక్ ఒక కుటుంబం అది మనది అనే భావన బలోపేతం చేస్తూ అనేక ఈవెంట్లు మరియు ప్రజలకు చేరువలో (అవుట్ రీచ్) ప్రోగ్రాం లు కూడి ఉన్నాయి. ప్రజలకు చేరువలో (అవుట్ రీచ్) ప్రోగ్రాం దృష్టి ఆర్ధిక అవగాహన మరియు ఆర్ధిక అక్షరాస్యత మీదనే. సామాన్య ప్రజానీకాన్ని ఆలకించడం, అట్టడుగుస్థాయి సంస్థలను చూసి అవి ఎలా నిర్వహించబడతున్నాయో తెలుసుకోవడం మరియు ఆర్దిక అవగాహన లో సవాళ్లు మరియు అవకాశాలను తెలుసుకోవడం కోసం, రిజర్వ్ బ్యాంక్ ఉన్నతస్థాయి నిర్వాహకవర్గం దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు ప్రయాణించారు
ప్లాటినం జూబిలీ ముగింపు వేడుకల్లో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి తాను ముంబాయి కి మరియు రిజర్వ్ బ్యాంకు కు రావడం అన్నది సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు. తాను రిజర్వ్ బ్యాంకులో ఉన్న రోజుల్ని సంతోషభరితం గాను మరియు ఉల్లాసంభరితంగాను గుర్తు చేసుకున్నారు. 1982 – 1985 మధ్యకాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గ ఉన్నారు.
గత 75 సంవత్సరాల నుంచి భారత ఆర్థికవ్యవస్థ లో రిజర్వ్ బ్యాంక్ ఎలా కీలక స్థానాన్ని ఆక్రమించుకుందో క్లుప్తంగా పేర్కొంటూ, క్రొత్త సవాళ్లు మరియు సందిగ్ధత పరిస్తుతులలో బాంకు ప్రతిస్పందించిన విధానానికి మరియు ఫైనాన్షియల్ మార్కెట్లలో నిలకడ నెలకొల్పడంలోను మరియు వృద్ధి చేయడంలోను కొంగ్రొత్త ఒరవడి నెలకొల్పడంలోనూ రిజర్వ్ బ్యాంకును ఆయన అభినందించారు. ఇటీవలి ఆర్దిక మాంద్యం సందర్భంగా భారతీయ బ్యాంకులు గాని ఫైనాన్షియల్ మార్కెట్లు గాని నేరుగా ప్రభావితం గాకపోయినప్పటికి, పలు రకాలుగా ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచే అవసరాన్నిమాత్రం ఈ సంక్షోభం దృష్టిలోకి తెచ్చిందని ఆయన అన్నారు. ఒకవైపు, నమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా మౌలిక వసతుల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు సమకూర్చేట్లుగా ఆర్దిక వ్యవస్థను తీర్చిదిద్దాలి, మరోవైపున దీర్ఘకాలిక డేట్ మార్కెట్ల అభివృద్ధికి మరియు కార్పొరేట్ బాండ్ మార్కెట్లను విస్తరించేందుకు దృష్టి సారించాలి. అంతేగాకుండా, నియంత్రణ మరియు బెటర్ ప్రైస్ డిస్కవరీ’ తో ఫ్యూచర్స్ మార్కెట్లను అభివృద్ధి చేయాలని, మెరుగైన మధ్యవర్తిత్వం కల్పించడానికి సంస్థాగత ఇబ్బుందులను కూడా తొలగించాలని ఆయన చెప్పారు.
మాననీయ భారత ఆర్దిక మంత్రి శ్రీ ప్రణాబ్ ముఖర్జీ వారి ప్రసంగంలో సంస్థ సేవలను కొనియాడారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చరిత్రను తిరగేస్తే గత సంఘటనాత్మక కాలం నుంచి తన విధానాలను ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకుంటూ మరియు కొత్త సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవటానికి తన పాత్రాను బాగా పటిష్టo చేసుకుందన్నారు. భారత్ లో ఆర్దిక మధ్యవర్తిత్వం నేరపే ప్రక్రియలో సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ద్రవ్య విధాన నిర్వహణా సామర్ధ్యాన్ని మెరుగుపరచుకోవడం మరియు దేశ ఆర్దిక రంగాన్ని అంతర్జాతీయ వ్యవస్థతో అనుసంధానం చెయడానికి పరిస్థితులను సిద్దంచేయడంద్వారా రిజర్వ్ బ్యాంకు విధానాల ప్రతిస్పందనలు మరియు కార్యక్రమాలు ఇటీవలి సంవత్సరాలలో నిజానికి గణనీయంగా తోడ్పడ్డాయి.
దేశ ఆర్ధిక వ్యవస్థలో అందరు భాగస్వామ్యుల మరియు స్టేక్ హోల్డర్ల మధ్య విశ్వాసస్థాయిని పెంపొందించడంలోను, మితిమించిన వోలటిలిటి ని లేకుండా చేయడం లేకపోతే ఇది వాస్తవిక ఆర్థిక కార్యకలాపాలను అసంగతంగా మరియు ప్రతికూలంగా ప్రభావితం చేసుండేది; మరియు ఆటువండి కష్టతరమైన సమయాల్లో నిరంతరం ఆర్దిక లావాదేవీలు జరిగేటట్లుచూడడంలో రిజర్వ్ బ్యాంక్ పాత్ర చాలా మెచ్చుకొనదగినది మరియు ప్రశస్తమైనదని ఆర్దిక మంత్రి ఉదహరించారు.
ముందుగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ డి. సుబ్బారావు గారు తన వ్యాఖ్యలలో సెంట్రల్ బ్యాంకింగ్ చరిత్ర మరియు రిజర్వ్ బ్యాంకు గురించి క్లుప్తంగా అనులేఖనం చేస్తూ, ప్లాటినం జూబిలీ అనేది కాలక్రమానుసారo ఒక మైలురాయి అని; ఏ సంస్థలోనైనా వేడుకలు జరుపుకునేందుకు ఒక సందర్భంగాను, ఐతే గతాన్ని అంతర్దర్శనం చేయడంలో ఒక అవకాశమని అన్నారు. రాబోయే కాలంలో రిజర్వ్ బ్యాంకు నాలుగు సవాళ్ళను తప్పక ఎదుర్కోవాలన్నారు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ప్రకారం ప్రపంచీకరణ పరిణామకపరిస్థితిలో ఆర్దిక మరియు నియంత్రణ విధానాలను నిర్వహించడంలో మరింత నేర్పరితనం నేర్చుకోవడం మొట్టమొదటి సవాలు.
రిజర్వ్ బ్యాంకు కూడా ఒక ప్రావీణ్యం గల సంస్థగా తనను తానూ సుస్థిరపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని భావం ప్రపంచీకరణతో పోరాటం కాదు, కానీ దీనిని దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నియంత్రించు కోవాలి. ఉత్కృష్ట ప్రపంచంలో మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతోఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ డిమాండ్లకు మరియు సంస్కృతికి అనుగుణంగా దానిని మలచాలి.
ప్రోద్బలంతో ఆర్దిక అవగాహన ను విస్త్రుతపరచడం రిజర్వ్ బ్యాంకుకు మూడవ అతి పెద్ద సవాలు. వ్యక్తిగత అనుభవం నుంచి మనందరికీ తెలుసు ఆర్దిక అవకాశం అనేది ఆర్దిక అందుబాటుతో గాఢంగా మెలిపెట్టబడిందని వారు విశదీకరించారు. అటువంటి అందుబాటు పేదలకు అత్యంత శక్తివంతమైంది ఎందుచేతనంటే అది పొదుపు పెట్టడానికి ప్రోత్సాహం కల్పిస్తుంది, అప్పును వినియోగించడం, మరియు ఆదాయం ఒడుడుడులను తట్టుకునేందుకు తాముగా బీమా చేసుకోవడానికి ఉపకరించుతుంది, ఆర్దిక అవగాహన మున్ముందు పెద్ద సవాలు ఎందుచేతనంటే ఇది ఒకేతూరి వృద్ధి మరియ సమానత్వం నకు ఉపకరించుతుంది.
అత్యంత పారదర్శకంగా మరియు ప్రశస్తనీయమైన సంస్థగా ఉండడం రిజర్వ్ బ్యాంక్ తుది సవాలు. “మనం ప్రజా సంస్థ వారలం, అత్యంత నాణ్యమైన సేవలను అందించే బాధ్యత కల్గిన వారలం. ప్రజలను ఆలకించడం మనకు ఆవశ్యకం. వారి ఆందోళనలను సున్నితంగా స్వీకరిస్తూ, వారి ఫిర్యాదులను పరిష్కరించాలి. సమర్ధవంతంగా మరియు విశ్వసనీయతతో ఎరుక పరచాలి. మరియు మన నిర్ణయాల మరియు చర్యల టెక్నికల్ లేక నాన్ టెక్నికల్ వెనుక గల లాజిక్ ను వారికి వివరించగలగాలి అని గవర్నర్ ముగిస్తూ; ఆర్దికరంగాల అభ్యున్నతి ఒక్కటే చివరి లక్ష్యం కాదు మరియు కానేరదు మౌలికరంగ వృద్ధి ని ప్రోత్సహించెంతవరకు ఆర్దిక రంగo ఎదుగుదల ముఖ్యమే, ఆర్థిక సంక్షోభం నుండి ఒక శక్తివంతమైన పాఠం రిజర్వ్ బ్యాంకు చేసే ప్రతి విధానం, ప్రతి కార్యక్రమం పేదజీవితాలను బాగుచెయ్యడానికి అనే విశ్వాసం ప్రజలకు కలిగేలా రిజర్వ్ బ్యాంకు ప్రవర్తించాలి.
స్మారక నాణేల సముదాయం (సెట్)
భారత ప్రభుత్వం వారు భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్లాటినం జయంతి సందర్భం గుర్తుగా రూ. 1, రూ.2, రూ.5, రూ.10 మరియు రూ.75 డినామినేషన్ లతో కూడిన ఐదు స్మారక నాణేల సముదాయం (సెట్)ను జారీ చేశారు. డినామినేషన్ రూ. 1, రూ.2, రూ.5, రూ.10 లలో నాణేలను చలామణి నాణేలుగా కూడా జారీ చేస్తారు. ఐదు నాణేల సముదాయం లో రూ.1 మరియు రూ.2 ఫెర్రిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ లోను, రూ.5 నాణెం నికెల్ ఇత్తడి లోను, రూ.10 ద్వి-లోహం లోను మరియు రూ.75 నాణెం సిల్వర్ అల్లోయ్ లోను ఉంటాయి.
నాణేల నమూనా (డిజైన్)
ముందువైపు:
అన్ని నాణేలకు ఈ వైపున అశోక స్తంభం లోని సింహ బురుజు (capitol) మధ్యలో ముద్రించబడి ఉంటుంది. దీనిక్రింద "सत्यमेव जयते" (సత్యమేవ జయతే) అని వ్యాఖ్య చెక్కబడి ఉంటుంది. ఎడమ వైపు పై పరిధి లో "भारत" (భారత్) అన్న పదం హిందీలో మరియు కుడి వైపు పై పరిధి లో “INDIA” (ఇండియా) అన్న పదం ఇంగ్లీషులో, ముద్రించబడి ఉంటాయి. సింహ బురుజు (capitol) క్రింద నాణెం విలువ (డినామినేషన్) ”75”, “10”, “5”, మొ. వానిలో ఏదైతే అది, అంతర్జాతీయ సంఖ్యలలో కలిగి ఉంటుంది. ఎడమ వైపు క్రింది పరిధిలో “रूपये” అని హిందీలో పదం మరియు కుడి వైపు క్రింది పరిధిలో “RUPEES” అని ఇంగ్లీషులో పదం ముద్రించబడి ఉంటాయి.
వెనుకవైపు:
నాణెం ఈ వైపున భారతీయ రిజర్వ్ బ్యాంకు చిహ్నం (ఎంబ్లమ్) తాటి చెట్టు మరియు వ్యాఘ్రము తో, ఎడమ పరిధిలో “भारतीय रिज़र्व बैंक” అని హిందీలో మరియు కుడి పరిధిలో “RESERVE BANK OF INDIA” అని ఇంగ్లీషులోచెక్కబడి ఉంటుంది మరియు ఎంబ్లెమ్ క్రిందుగా పదం “भारत प्लैटिनम जुबली” హిందీలో మరియు “PLATINUM JUBILEE“ ఇంగ్లీషులో, సంవత్సరం “1935-2010” తో పాటు చెక్కబడి ఉంటాయి.
మింట్ రోడ్ మైల్స్టోన్స్: RBI At 75
‘మింట్ రోడ్ మైల్స్టోన్స్: RBI At 75’ - భారతీయ రిజర్వ్ బ్యాంకు యొక్క ప్లాటినం జూబిలీ సంవత్సర గురుతుగా సంకలనం చేయబదిన ఒక కాలక్రమo (క్రోనాలజీ) ఇది. సంకలనానికి ముందు పీఠికలో క్లుప్తంగా చరిత్ర ప్రస్తుతించబడినది మరియు పాఠకులకు దేశంలో సెంట్రల్ బ్యాంకు పాత్ర మరియు బాధ్యతలు వివరించబడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగానూ మరియు దేశీయంగానూ ఉన్నటువంటి ఈనాటి విస్తృత సామాజిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో, సెంట్రల్ బ్యాంకింగ్ పాత్ర వివరణకు ఈ ప్రచురణ ఒక ప్రయత్నం చేసింది. గత చరిత్ర పుటల్లోని కొన్ని సంఘటనలతో మరియు మార్గాన్ని రిజర్వ్ బ్యాంకు ఎలా దాటిందో దృశ్యాలతో మరియు లఘుచిత్రాలతో వివరించ బడింది. రిజర్వ్ బ్యాంక్ ఆర్దిక అక్షరాస్యత పురోగమనంలో “మింట్ రోడ్ మైల్స్టోన్స్: RBI At 75” ఒక భాగం. బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ లో ఆసక్తిగల వారందరు – విద్యార్థులు, ప్రొఫెషనల్స్ మరయు సామాన్య ప్రజానీకo – ఈ పుస్తకాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాము.
అజిత్ ప్రసాద్
మేనేజర్
ప్రెస్ రిలీజ్: 2009-2010/1340
|