తేదీ: మే 15, 2017
ఆదాయ పన్ను బకాయిలు ముందస్తుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లోగాని లేదా అధికృత బ్యాంక్ శాఖల్లోగాని చెల్లించండి – జూన్ 2017
ఆదాయ పన్ను బకాయిలు చెల్లించడానికి, రిజర్వ్ బ్యాంక్‌లో సాధ్యమయినంతమేరకు అదనపు కౌంటర్లు తెరిచినా, జూన్ నెల చివరిలో విపరీతమైన రద్దీ ఉంటోందని గమనించడం జరిగింది. దీనివల్ల జనం ఎంతో సమయం వరుసలో వేచి ఉండడం తప్పనిసరి అవుతోంది. ఈ అసౌకర్యాన్ని నివారించడంకోసం, పన్ను చెల్లించేవారు ఆఖరి నిమిషం వరకు వేచి ఉండకుండా, గడువు తేదీకి వీలయినంత ముందే ఆదాయ పన్ను చెల్లించాలని సూచన.
ఇంతేగాక, ముంబైలో ఈక్రింద సూచించిన, ఎంపికచేసిన అధికృత ప్రాతినిధ్య బ్యాంక్ శాఖలు (Branches of Accredited Agency Banks), ఆదాయ పన్ను బకాయిలు స్వీకరించడానికి అనుమతించబడ్డాయి. వీటిలో చాలా బ్యాంకులు, పన్నులు 'ఆన్‌లైన్‌లో’ (on-line) చెల్లించడానికి సదుపాయం కల్పిస్తున్నాయి. పన్ను చెల్లించేవారు, వారి సౌకర్యంకోసం ఈ ఏర్పాట్లను వినియోగించుకోవచ్చు.
1. అలహాబాద్ బ్యాంక్ |
9. దేనా బ్యాంక్ |
17. యూకో బ్యాంక్ (UCO Bank) |
2. అంధ్రా బ్యాంక్ |
10. ఐ డి బి ఐ బ్యాంక్ |
18. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
3. బ్యాంక్ ఆఫ్ బరోడా |
11. ఇండియన్ బ్యాంక్ |
19. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
4. బ్యాంక్ ఆఫ్ ఇండియా |
12.ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ |
20. విజయా బ్యాంక్ |
5. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర |
13. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ |
21. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
6. కెనరా బ్యాంక్ |
14. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ |
22. ఎచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్ |
7. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
15. పంజాబ్ నేషనల్ బ్యాంక్ |
23. ఏక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ |
8. కార్పొరేషన్ బ్యాంక్ |
16. సిండికేట్ బ్యాంక్ |
24. ఐ సి ఐ సి ఐ బ్యాంక్ లిమిటెడ్ |
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/3068
|