మే 13, 2016
BBPOU లకు అనుమతి ఇచ్చేందుకు దరఖాస్తులు : ప్రస్తుత పరిస్థితి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్ 20, 2015న భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU)గా పని చేసేందుకు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. నవంబర్ 13, 2015న జారీ చేసిన ప్రెస్ రిలీజ్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ తేదీని నవంబర్ 20, 2015 నుంచి డిసెంబర్ 18, 2015కు పొడిగించింది. నవంబర్ 20, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసే వరకు అందిన దరఖాస్తులను రిజర్వ్ బ్యాంక్ పరిశీలించడం జరుగుతుందని కూడా గతంలో సూచించడం జరిగింది.
నవంబర్ 20, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసేవరకు రిజర్వ్ బ్యాంకుకు బ్యాంకింగేతర సంస్థల నుంచి అథరైజేషన్ కొరకు 12 దరఖాస్తులు, బ్యాంకుల నుంచి BBPOU గా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆమోదం కొరకు 18 విజ్ఞాపనలు రావడం జరిగింది. పొడిగించిన గడువు డిసెంబర్ 18, 2015 నాటికి మొత్తంగా బ్యాంకింగేతర సంస్థల నుంచి 62 దరఖాస్తులు, బ్యాంకుల నుంచి ఆమోదం కోసం 80 విజ్ఞాపనలు రావడం జరిగింది.
ఈ దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ తన నిర్ణయాలను సరాసరి దరఖాస్తుదారులకే తెలియజేయడం ప్రారంభించింది. దరఖాస్తుదారులకు ప్రస్తుత భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) పరిధిలో నెట్ వర్క్ ప్రమాణాలు, తగిన బిల్లింగ్ అనుభవంతో ఇతర అన్ని అర్హతా ప్రమాణాలు ఉన్న సందర్భాలలో BBPOUగా కార్యకలాపాలు నిర్వహించేందుకు వాటికి ‘ఇన్-ప్రిన్సిపుల్’ ఆమోదాన్ని తెలియజేయడం జరిగింది. BBPOUగా అర్హతకు అవసరమైన బిల్లింగ్ అనుభవంలో, దరఖాస్తుదారు కేవలం బిల్ అగ్రిగేటర్ యొక్క ఫ్రంట్-ఎండ్ గా ఉండడం, బిల్లర్లతో టై-అప్ లు లేకపోయిన సందర్భంలో దానిని బిల్లింగ్ అనుభవంగా పరిగణించరు.
ప్రస్తుత BBPS పరిధిలో నెట్ వర్త్, బిల్లింగ్ అనుభవం సహా తగిన అర్హతా ప్రమాణాలు లేని సంస్థల దరఖాస్తులను వెనక్కి తిప్పి పంపడం జరుగుతోంది.
దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల, ఎప్పటిలాగే, దరఖాస్తుదారుల నుంచి పూర్తి సమాచారం ఉన్న దరఖాస్తులను స్వీకరించిన క్రమంలో వాటిని పరిశీలించడం జరుగుతుంది.
అల్పానా కిల్లావాలా,
ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్: 2015-2016/2664
సంబంధిత సర్క్యులర్లు మరియు ప్రెస్ రిలీజ్ లు |
నవంబర్ 24, 2015 |
భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) లో సెంట్రల్ యూనిట్ గా పని చేసేందుకు NCPI కు ‘ఇన్- ప్రిన్సిపుల్’ ఆమోదం తెలిపిన RBI |
నవంబర్13, 2015 |
భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా అథరైజేషన్ కొరకు దరఖాస్తుల చివరి తేదీ గడువును పొడిగించిన RBI |
అక్టోబర్ 20, 2015 |
అధీకృత భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న RBI |
నవంబర్ 28, 2014 |
భారత బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) అమలు - మార్గదర్శకాలు |
|