తేదీ: నవంబర్ 13, 2015
భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా అథరైజేషన్ కొరకు
దరఖాస్తుల చివరి తేదీ గడువును పొడిగించిన RBI
భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా అథరైజేషన్ కొరకు దరఖాస్తుల చివరి తేదీ గడువును గతంలో ఉన్న నవంబర్ 20, 2015 నుండి డిసెంబర్ 18, 2015 కు పొడిగించింది. వివిధ సంస్థలు గడువులోపు దరఖాస్తులను సమర్పించడంలో ఉన్న ఇబ్బందులను వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకో్వడం జరిగింది.
ఇప్పుడు దరఖాస్తులను డిసెంబర్ 18, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసే వరకు స్వీకరిస్తారు. అయితే, నవంబర్ 20, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసే వరకు వచ్చిన దరఖాస్తులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొదట పరిశీలిస్తుందని గుర్తించాలి.
ప్రస్తుతం భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) పరిధిలో బిల్ పేమెంట్ కార్యకలాపాలు చేపడుతున్న బ్యాంకులు, నాన్ బ్యాంకులు భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్(BBPOU)లుగా లేదా అధీకృత BBPOU ఏజెంట్లుగా పాల్గొనవచ్చు. BBPOU కావాలనుకుంటున్న సంస్థలు పొడిగించిన గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
BBPS అభివృద్ధి, ఎదుగుదల, విస్తృతి యొక్క పరిధి ఆధారంగా, రిజర్వ్ బ్యాంక్ తిరిగి BBPOU ల అథరైజేషన్/ఆమోదం కొరకు భవిష్యత్తులో దరఖాస్తులను ఆహ్వానించవచ్చు.
ఆసక్తి కలిగిన సంస్థల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు, రిజర్వ్ బ్యాంక్ భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థపై కొన్ని ‘తరచుగా అడిగే ప్రశ్నల’ను తన వెబ్ సైట్ లో పొందుపరచింది. ఏవైనా ప్రత్యేక ప్రశ్నలు ఉన్నట్లయితే డిసెంబర్ 11, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసే సమయం వరకు వాటిని మెయిల్ చేయవచ్చు.
అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్
ప్రెస్ రిలీజ్: 2015-2016/1148
సంబంధిత ప్రెస్ రిలీజ్ |
అక్టోబర్ 20, 2015 |
అధీకృత భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న RBI |
|