తేదీ: ఆగస్ట్ 31, 2017
మరాఠా సహకారి బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర –
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాల జారీ
రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35-A క్రింద ఆగస్ట్ 31, 2016 తేదీన మరాఠా సహకారి బ్యాంక్ లిమిటెడ్‌కు, ఆరు నెలల గడువుకు (అనగా, ఫిబ్రవరి 28, 2017 వరకు) నిర్దేశాలు జారీ చేసింది. ఇవి, తదుపరి, ఫిబ్రవరి 23, 2017 తేదీన, జారీచేసిన ఆదేశాల ద్వారా సవరించబడ్డాయి. ఈ ఆదేశాలు, సమీక్షకులోబడి, మరొక ఆరు నెలలు (అనగా ఆగస్ట్ 31, 2017 వరకు), పొడిగించబడ్డాయి.
మరాఠా సహకారి బ్యాంకుకు ఆగస్ట్ 31, 2016 న జారీ చేయబడి, ఫిబ్రవరి 23, 2017 తేదీన సవరించబడిన ఆదేశాలు, ప్రజాహితం దృష్ట్యా, పొడిగించడం అవసరమని, రిజర్వ్ బ్యాంక్ భావించింది. తదనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35 A (సెక్షన్ 56తో కలిపి) ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, ఆగస్ట్ 31, 2016 తేదీన మరాఠా సహకారి బ్యాంక్ లిమిటెడ్, ముంబైకి జారీ చేయబడి, ఆ తరువాత ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరి సారి ఆగస్ట్ 31, 2017 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక ఆరు నెలల వరకు (అనగా సెప్టెంబర్ 01, 2017 నుండి ఫిబ్రవరి 28, 2018 వరకు), సమీక్షకులోబడి, కొనసాగుతాయని ఇందుమూలంగా ఆదేశిస్తోంది.
పైన తెలిపిన నిర్దేశాలలో విధించిన ఇతర షరతులు, నిబంధనలలో, (సవరణలతో సహా), ఎట్టి మార్పూ లేదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/594 |