తేదీ: సెప్టెంబర్ 07, 2017
భిల్వాడా మహిళా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., భిల్వాడా, రాజస్థాన్–
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),
సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద నిర్దేశాల జారీ
రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35 A (సెక్షన్ 56తో కలిపి) ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, భిల్వాడా మహిళా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (లి), భిల్వాడా, (రాజస్థాన్) కు జారీచేసిన ఆదేశాలు, ప్రజాహితం దృష్ట్యా, పొడిగించడం అవసరమని, రిజర్వ్ బ్యాంక్ భావించిందని తెలపడమైనది. మార్చ్ 07, 2017 తేదీన జారీ చేయబడి, మార్చ్ 09, 2017 నుండి అమలులోనున్న ఆదేశాలు మరొక ఆరు నెలలు అమలులో (అనగా, సెప్టెంబర్ 10, 2017 నుంచి మార్చ్ 09, 2018 వరకు) కొనసాగుతాయని సెప్టెంబర్ 01, 2017 తేదీన, ఆదేశాలు (సమీక్షకు లోబడి) జారీచేయడం జరిగింది.
పైన తెలిపిన నిర్దేశాలలో విధించిన ఇతర షరతులు, నిబంధనలలో, ఎట్టి మార్పూ లేదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/662 |