| కరెన్సీ నోట్ల పరిశీలనకు రిజర్వ్ బ్యాంక్‌చే అధునాతన యంత్రాల వినియోగం |
సెప్టెంబర్ 10, 2017
కరెన్సీ నోట్ల పరిశీలనకు రిజర్వ్ బ్యాంక్‌చే
అధునాతన యంత్రాల వినియోగం సమాచార హక్కు చట్టంక్రింద ఇవ్వబడిన ఒక జవాబు పేర్కొంటూ, కొన్ని పత్రికలు, రిజర్వ్ బ్యాంక్ నిర్దిష్ట బ్యాంక్ నోట్ల (specified bank notes) పరిశీలనకు, యంత్రాలను వినియోగించడం లేదని ఆరోపించాయి. కరెన్సీ నోట్ల నాణ్యత, సంఖ్య (నిర్దుష్ట బ్యాంక్ నోట్లతో సహా) ఖచ్చితంగా తెలిసికొనేందుకు రిజర్వ్ బ్యాంక్ వాస్తవానికి, అధునాతనమైన కరెన్సీ వెరిఫికేషన్ & ప్రాసెసింగ్ యంత్రాలను (Currency Verification & Processing Machinery, CVPS) వినియోగిస్తుంది. నోట్ల లెక్కింపు యంత్రాలకన్నా ఇవి ఎంతో మేలైనవి. పరిశీలనా సామర్థ్యం అధికంచేయడానికి యంత్రాలు రెండు దఫాల్లో (two shifts) వినియోగించడమేగాక, వాణిజ్య బ్యాంకులనుండి తాత్కాలికంగా తీసికొన్న యంత్రాల్నికూడా, తగిన మార్పులుచేసి వినియోగిస్తోంది. రిజర్వ్ బ్యాంక్, పరిశీలనా సామర్థ్యం మరింతగా హెచ్చించడానికి, ఇతర మార్గాలు కూడా అన్వేషిస్తోంది.
జోస్ జె కత్తూర్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/685 |
|