తేదీ: సెప్టెంబర్ 21, 2017
నాశిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంక్ లి., నాశిక్, మహారాష్ట్ర –
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),
సెక్షన్ 35 A క్రింద నిర్దేశాల జారీ
నాశిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంక్ లి., నాశిక్, మహారాష్ట్ర, సెప్టెంబర్ 8, 2015 జారీచేసిన ఆదేశాలద్వారా, సెప్టెంబర్ 9, 2015 పనివేళల ముగింపు సమయంనుండి, ఆరు నెలల కాలానికి, నిర్దేశాల పరిధిలోకి తేబడింది. నిర్దేశాల అమలుకాలం, తదుపరి, మార్చ్ 03, 2016, ఆగస్ట్ 25, 2016, మరియు మార్చ్ 07, 2017 తేదీలలో సవరించిన ఆదేశాల ద్వారా ప్రతిసారీ, ఆరు నెలలు పొడిగించబడింది. సెప్టెంబర్ 8, 2015న జారీ చేయబడి, మార్చ్ 03, 2016, ఆగస్ట్ 25, 2016, మార్చ్ 07, 2017 తేదీలలో జారీచేసిన ఆదేశాల ద్వారా పొడిగించబడుతూ వచ్చిన నిర్దేశాల అమలుకాలం, సెప్టెంబర్ 01, 2017 జారీచేసిన ఆదేశాల ద్వారా మరొక ఆరు నెలలు, (అనగా సెప్టెంబర్ 10, 2017 నుండి మార్చ్ 09, 2018 వరకు (సవరణలకు లోబడి), పొడిగించబడినదని, ఇందుమూలంగా ప్రజలకు తెలియజేయడమైనది.
పైన తెలిపిన నిర్దేశాలలో విధించిన ఇతర షరతులు, నిబంధనలలో, ఎట్టి మార్పూ లేదు.
సెప్టెంబర్ 01, 2017న, పై నిర్దేశాలు సవరిస్తూ జారీచేసిన ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకోసం, నాశిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంక్ లి., ఆవరణలో ప్రదర్శించబడినది.
రిజర్వ్ బ్యాంక్, పైన తెలిపిన సవరణలు చేసినంత మాత్రాన, బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడిందని, తృప్తి చెందిందని భావించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/798 |