సెప్టెంబర్ 29, 2017
సెక్షన్ 35 A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు)
క్రింద నిర్దేశాలు – ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర –
కాలపరిమితి పొడిగింపు
ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర, మార్చ్ 30, 2017 తేదీన జారీచేసిన ఆదేశాల ద్వారా, మార్చ్ 30, 2017, పనివేళల ముగింపు సమయం నుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడింది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35 A, సబ్-సెక్షన్ (1) (సెక్షన్ 56తో కలిపి) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, మార్చ్ 30, 2017న పై బ్యాంకుకు జారీచేసిన ఆదేశాలు, మరొక ఆరు నెలలపాటు (అనగా మార్చ్ 31, 2018 వరకు) సవరణలకు లోబడి అమలులో కొనసాగాలని సెప్టెంబర్ 25, 2017 తేదీన ఆదేశించినట్లు, ఇందుమూలంగా ప్రజలకు తెలియజేయడమైనది.
పైన పొడిగింపు తెలుపుతూ, సెప్టెంబర్ 25, 2017న జారీచేసిన ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకోసం, కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఆవరణలో ప్రదర్శించబడినది.
రిజర్వ్ బ్యాంక్, పైన తెలిపిన పొడిగింపు / సవరణలు చేసినంత మాత్రాన, బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడిందని తృప్తి చెందిందని భావించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/895 |