అక్టోబర్ 13, 2017
లక్నోలోని హెచ్.సీ.బీ.యల్ (HCBL) కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కు ఆర్.బీ.ఐ జారీ చేసిన
ఆదేశాల పొడిగింపు భారతీయ రిజర్వు బ్యాంక్ లక్నో లోని హెచ్.సీ.బీ.యల్ (HCBL) కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కు జారీ చేసిన ఆదేశాలను మరో ఆరు నెలలపాటు అక్టోబర్ 16, 2017 నుండి ఏప్రిల్ 15, 2018 వరకు సమీక్షకు లోబడి పొడిగించినది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం , 1949 సెక్షన్ 35 A (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధన ప్రకారం, ఈ బ్యాంకు ను ఏప్రిల్ 10, 2015 ఆదేశాల ననుసరించి, ఏప్రిల్ 16, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుండి ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది. వీటి గడువును అక్టోబర్ 09, 2017 ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 15, 2018 వరకు పొడిగించడం జరిగింది. ఈ ఆదేశాలకు సంబంధించిన ఇతర నియమ నిబంధనలలో ఎటువంటి మార్పులు లేవు. అక్టోబర్ 09, 2017 ఆదేశాల నకలును ప్రజల పరిశీలనార్ధం బ్యాంకు పరిసరాలలో ఉంచడం జరుగుతుంది.
రిజర్వు బ్యాంకు చే జారీ చేయబడిన ఆదేశాలు మరియు మార్పుల ననుసరించి పైన పేర్కొన్న బ్యాంకు యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని గాని క్షీణించినదని గాని పరిగణింపరాదు. పరిస్థితులను బట్టి రిజర్వు బ్యాంక్ తమ ఆదేశాలలో మార్పు చేసే అవకాశాన్నిపరిశీలించవచ్చును.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజరు
ప్రెస్ రిలీజ్: 2017-2018/1032 |