అక్టోబర్ 18, 2017
ఆర్.బీ.ఐ, నాగపూర్ లోని నవోదయ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కు జారీ చేసిన
ఆదేశాలను జనవరి 15, 2018 వరకు పొడిగించింది భారతీయ రిజర్వు బ్యాంక్ నాగపూర్ లోని నవోదయ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కు అంతకుముందు జారీ చేసిన ఆదేశాలను మరో మూడు నెలలపాటు పొడిగించినది. ఈ ఆదేశాలు ఇప్పుడు, సమీక్షకు లోబడి, జనవరి 15, 2018 వ తేదీ వరకు అమలులో ఉంటాయి. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం , 1949 సెక్షన్ 35 A (1) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం, తమకు దఖలుపరచబడిన ఆధికారాలతో రిజర్వు బ్యాంకు ఈ ఆదేశాలను విధించింది. ఆదేశాల నకలును ఇష్టప్రజల పరిశీలనార్ధం బ్యాంకు పరిసరాలలో ఉంచడం జరుగుతుంది.
రిజర్వు బ్యాంకు చే జారీ చేయబడిన ఆదేశాలను బ్యాంకు యొక్క బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు అయిందని భావించరాదు. బ్యాంకు తన బ్యాంకింగ్ బిజినెస్ ను నిబంధనలతో, వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడేనంతవరకు, నిర్వహిస్తుంది. పరిస్థితులను బట్టి రిజర్వు బాంక్ తమ ఆదేశాలలో మార్పు చేసే అవకాశాన్నిపరిశీలించవచ్చును.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజరు
ప్రెస్ రిలీజ్: 2017-2018/1080 |