అక్టోబర్ 24, 2017.
యస్ (Yes) బ్యాంక్ లిమిటెడ్ పై ఆర్.బి.ఐ నగదు జరిమానా విధింపు.
ఇన్కమ్ రెకగ్నిషన్ అసెట్ క్లాసిఫికేషణ్ (ఐరాక్) నిబంధనల ఉల్లంఘన మరియు ఏ.టి.యం సైబర్-సెక్యూరిటీ సంఘటనకు సంబందించిన సమాచార నివేదిక ఇవ్వడంలో జాప్యం వంటి అవకతవకలకు పాల్పడినందులకు, రిజర్వ్ బ్యాంక్, యస్ (Yes) బ్యాంక్ లిమిటెడ్ పై అక్టోబర్ 23, 2017 తేదీన రూ. 60 మిలియన్ల నగదు జరిమానా విధించింది.
తమ ఆదేశాలను ఉల్లంఘించినందులకు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 47A (1)(c) మరియు సెక్షన్ 46 (4)(i) నిబంధనల క్రింద రిజర్వ్ బ్యాంకుకు దఖలుపరచబడిన ఆధికారాలతో, ఈ జరిమానా విధించడం జరిగింది.
ఈ చర్య, నియంత్రణలు పాటించడంలో లోపాల మూలంగా తీసుకోబడినది. అంతేగాని, వారి ఖాతాదార్లతో జరిపిన లావాదేవీలు, ఒప్పందాల చెల్లుబడి మీద తీర్మానం చెప్పినట్లుగా భావింపరాదు.
నేపథ్యం
మార్చ్ 31, 2016 తేదీనాటి బ్యాంక్ ఆర్ధిక పరిస్థితి మీద నిర్వహించిన ఆర్బీఐ చట్టపరమైన పరిశోధనలో, ఇతరవాటితోపాటు, నిరర్ధక ఆస్థుల గుర్తింపు లో ఆర్బేఐ నియంత్రణల ఉల్లంఘన అవకతవకలున్నాయి. బ్యాంక్, తమ ఏ.టి.యం సైబర్-సెక్యూరిటీ సంఘటనకు సంబందించిన సమాచార నివేదికను నిర్దేశించిన సమయం లోపల ఇవ్వలేకపోయింది. రిజర్వ్ బ్యాంక్ పరిశోధన మరియు సంబంధిత పత్రాల ఆధారంగా జూలై 6, 2017 మరియు ఆగష్టు 24, 2017 తేదీలలో నోటిసుల ద్వారా బ్యాంక్ సంజాయిషీ కోరడమైనది. రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన కొన్ని నిర్దేశాలు, ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు బ్యాంకుకు షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. బ్యాంక్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన జవాబు, మౌఖిక నివేదనలు, సమర్పించిన అదనపు సమాచారం మరియు పత్రాలను పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగ్గవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చింది.
జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్
ప్రెస్ రిలీజ్: 2017-2018/1116 |