అక్టోబర్ 24, 2017.
ఐ.డి.యఫ్.సీ (IDFC) బ్యాంక్ లిమిటెడ్ పై ఆర్.బి.ఐ నగదు జరిమానా విధింపు. భారతీయ రిజర్వ్ బ్యాంకు, లోన్స్ మరియు అడ్వాన్సులకు సంబంధించిన నియంత్రణా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐ.డి.యఫ్.సీ (IDFC) బ్యాంక్ లిమిటెడ్ పై, అక్టోబర్ 23, 2017 తేదీన రూ. 20 మిలియన్ల నగదు జరిమానా విధించింది. తమ ఆదేశాలను ఉల్లంఘించినందులకు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 47A (1)(c) మరియు సెక్షన్ 46 (4)(i) నిబంధనల క్రింద రిజర్వ్ బ్యాంకుకు దఖలు పరచబడిన ఆధికారాలతో, ఈ జరిమానా విధించడం జరిగింది.
ఈ చర్య, నియంత్రణలు పాటించడంలో లోపాల మూలంగా తీసుకోబడినది. అంతేగాని, వారి ఖాతాదార్లతో జరిపిన లావాదేవీలు, ఒప్పందాల చెల్లుబడి మీద తీర్మానం చెప్పినట్లుగా భావింపరాదు.
నేపథ్యం
ఇతరవాటితోపాటు, లోన్స్ మరియు అడ్వాన్సుల మంజూరు / పునరుద్ధరణ లకు సంబంధించి ఆర్బేఐ ఆదేశాల ఉల్లంఘనా అవకతవకలను డిసెంబర్ 31, 2016 తేదీతో ముగిసిన బ్యాంక్ ఫైనాన్సియల్ స్టేటస్ రిపోర్ట్ బట్టబయలు చేసింది. ఈ స్టేటస్ రిపోర్ట్ ఆధారంగా, రిజర్వ్ బ్యాంక్ వారి ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను, ఆగష్టు 07, 2017 తేదీన బ్యాంక్ కు షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. బ్యాంక్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన జవాబు, మౌఖిక నివేదనలు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగ్గవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చింది.
జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్
ప్రెస్ రిలీజ్: 2017-2018/1117 |