తేదీ: ఆగస్ట్ 31, 2017
హార్దోయ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, హార్దోయ్, ఉత్తర్ ప్రదేశ్,
లైసెన్స్, రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆగస్ట్ 11, 2017 తేదీన, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 22 (సెక్షన్ 56 తో కలిపి) క్రింద జారీ చేసిన ఆదేశాలద్వారా, హార్దోయ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, హార్దోయ్, ఉత్తర్ ప్రదేశ్‌కు, బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుటకు జారీ చేసిన లైసెన్స్, ఆగస్ట్ 30, 2017 పని ముగింపువేళ నుండి రద్దు చేసినదని, ప్రజలకు తెలియజేయడమైనది. అందువల్ల సదరు బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 5(b) లో నిర్వచించిన 'బ్యాంకింగ్' కార్యకలాపాలు (డెపాజిట్లు అంగీకరించుట/తిరిగి చెల్లించుటతో సహా), నిర్వహించుట, నిషేధించబడినది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/587 |