Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (98.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 04/09/2017
ఉన్నత ఆర్థిక పరిశోధన మరియు విద్యా కేంద్రానికి (Centre for Advanced Financial Research and Learning, CAFRAL, సి ఎ ఎఫ్ ఆర్ ఎ ఎల్) నిర్దేశకులుగా డా. అమార్త్య లాహిరి

తేదీ: సెప్టెంబర్ 04, 2017

ఉన్నత ఆర్థిక పరిశోధన మరియు విద్యా కేంద్రానికి (Centre for Advanced Financial Research and Learning, CAFRAL,
సి ఎ ఎఫ్ ఆర్ ఎ ఎల్) నిర్దేశకులుగా డా. అమార్త్య లాహిరి

సెప్టెంబర్ 1, 2017 తేదీన, డా. అమార్త్య లాహిరి, సి ఎ ఎఫ్ ఆర్ ఎల్ నిర్దేశకులుగా చేరారు. ఇంతకు ముందు, ఆయన రాయల్ బ్యాంక్ ఫాకల్టీ రిసెర్చ్ ప్రొఫెసర్ మరియు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, వాంకూవర్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో, గ్రాడ్యుయేట్ స్టడీస్, నిర్దేశకులుగా పనిచేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్‌ రిసెర్చ్, చైర్ ఆఫ్ ఇండియన్‌ రిసెర్చ్, జోహల్‌ చైర్, పదవి నిర్వహించారు. బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరడానికి ముందు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, లాస్ ఏంజిలిస్ మరియు జాన్‌ హాప్కిన్స్ విశ్వవిద్యాలయాలలో రిసెర్చ్ పదవులలో ఉన్నారు.

అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రం, స్థూల ఆర్థిక వ్యవస్థలు వీరి విశిష్ట రంగాలు. విదేశీ మారక రేట్ నిర్వహణ, ద్రవ్య విధానం, చెల్లింపుల సమతుల్యతలో (balance of payments) సంక్షోభం, ఆర్థిక ప్రగతి మొదలైన విషయాలపై ఎన్నో రచనలు చేశారు. ఇటీవలికాలంలో, మానిటరీ ఎకనామిక్స్; లింగ విభేదాలు (gender gaps); వర్ణ అసమానతలు (inequality across castes); కార్మిక వలసల (labour mobility) అంశాలపై తమ పరిశోధన కేంద్రీకరించారు.

డా. అమార్త్య, రచనలు, జర్నల్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ, జర్నల్ ఆఫ్ ఎకనామిక్ థియరీ, జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, జర్నల్ ఆఫ్ మానిటరీ ఎకనామిక్స్, యూరోపియన్‌ ఎకనామిక్ రెవ్యూ, వంటి ప్రఖ్యాత ఆర్థిక పత్రికలలో మరియు ప్రపంచ బ్యాంక్, బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ యొక్క విధాన ప్రచురణలలో, ప్రచురింపబడ్డాయి.

పరశోధన, మరియు శిక్షణా రంగాల్లో వీరి కృషికి, డా. అమార్త్య, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిలిస్, ప్రదానం చేసిన 'ఫాకల్టీ కరీర్ డెవెలప్‌మెంట్ అవార్డ్' మరియు 'డిపార్ట్‌మెంటల్ డిస్టిన్గ్విష్డ్ టీచింగ్ అవార్డ్' లు అందుకొన్నారు. డా. అమార్త్య, అమెరికన్‌ ఎకనామిక్ అసోసియేషన్‌ మరియు ఎకనామిక్ సొసైటీలో సభ్యులు. ఇంతేగాక, యూరోపియన్‌ ఎకనామిక్ రెవ్యూ మరియు జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ప్రచురణలకు, సహ సంపాదకులు.

డా. అమార్త్య లాహిరి, ఆర్థిక శాస్త్రం లో Ph.D, యూనివర్సిటీ ఆఫ్ మారీలాండ్, కాలెజ్ పార్క్ నుండి పూర్తిచేశారు; ఆర్థిక శాస్త్రం లో MA, డెల్లి స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్; ఆర్థిక శాస్త్రం లో BA, సైంట్ స్టీఫెన్స్ కాలెజ్, డెల్లి నుండి పొందారు.

జోస్ జె కత్తూర్
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2017-2018/626

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….