| రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ మండలిలో, శ్రీ రాజీవ్ కుమార్ (సెక్రటరీ, ఆర్థిక సేవల విభాగం) నియామకం |
తేదీ: సెప్టెంబర్ 13, 2017
రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ మండలిలో, శ్రీ రాజీవ్ కుమార్
(సెక్రటరీ, ఆర్థిక సేవల విభాగం) నియామకం భారత ప్రభుత్వం, ఆర్థిక సేవల విభాగంలో సెక్రటరీగా ఉన్న శ్రీ రాజీవ్ కుమార్ గారిని, రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ మండలిలో, మిస్. అంజలీ చిబ్ దుగ్గల్ స్థానంలో, నిర్దేశకులుగా నియమితుల్ని చేసింది. వీరి నియామకం, సెప్టెంబర్ 12, 2017 తేదీనుండి, మరల ఆదేశాల జారీవరకు అమలులో ఉంటుంది.
జోస్ జె కత్తూర్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/727 |
|