అక్టోబర్ 11, 2017
భారతీయ రిజర్వు బ్యాంక్
ప్రభుత్వరంగ బ్యాంకులకు/ఆర్ధిక సంస్థలకు ద్విభాష/హిందీ గృహపత్రికా (హౌస్ మేగజిన్) పోటీ
2016-17 – ప్రవేశాలకు (ఎంట్రీలకు) ఆహ్వానం
హిందీ (రాజ్ భాషా) వాడకాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ ప్రభుత్వరంగ బ్యాంకులకు/ఆర్ధిక సంస్థలకు ద్విభాష/హిందీ గృహపత్రికా (హౌస్ మేగజిన్) పోటీ నిర్వహిస్తున్నది. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు/ఆర్ధిక సంస్థలు తేదీ ఏప్రిల్ 01, 2016 నుండి మార్చ్ 31, 2017 వరకు వారు ప్రచురించిన ద్విభాష/హిందీ గృహపత్రిక (హౌస్ మేగజిన్)లను, ఒక్కొక్కదానికి ఆరు కాపీల చొప్పున, పూరించిన నిర్దేశించిన ఫార్మాట్ తో పాటు పంపించవలసినదిగా ఆహ్వానించడమైనది. నిర్ధారణ కమిటి మరియు రిజర్వు బ్యాంక్ రాజ్ భాషా విభాగం నిర్ణయించిన హౌస్ మేగజిన్ల విజేతలకు అవార్డు షీల్డ్/సర్టిఫికెట్లు బహుకరిస్తారు.
ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ నవంబర్ 06, 2017.
ఎంట్రీలు ఈ క్రింది చిరునామాకు పంపవలసినది:
డిప్యూటీ జనరల్ మేనేజర్-ఇన్చార్జ్
రాజ్ భాషా విభాగం, భారతీయ రిజర్వు బ్యాంక్, కేంద్రీయ కార్యాలయం,
సీ-9, 2 వ అంతస్తు, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, బాంద్రా (ఈస్ట్), ముంబాయి 400051.
పోటీ శూచకాలు (క్రైటీరియా) అనుబంధం A లో ఇవ్వబడినవి. ఎంట్రీలు పంపడానికి నిర్దేశించిన ఫార్మాట్ అనుబంధం B లో ఇవ్వబడినది.
జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్
ప్రెస్ రిలీజ్: 2017-2018/999. |