నవంబర్ 15, 2017
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, వసంత్ దాదా నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ (Vasantdada Nagari Sahakari Bank Ltd.) ఉస్మానాబాద్, మహారాష్ట్ర కు నిర్దేశాల జారీ
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35A, సబ్ సెక్షన్ (1) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం సంక్రమించిన ఆధికారాలతో ప్రజలమేలుకై, రిజర్వ్ బ్యాంకు, వసంత్ దాదా నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ (Vasantdada Nagari Sahakari Bank Ltd.), ఉస్మానాబాద్, మహారాష్ట్ర కు నవంబర్ 13, 2017 తేదీ పనిముగింపు వేళ నుండి ఆరు నెలల పాటు అమలులో ఉండేలా, నిర్దేశాలను (Directions) జారీచేసింది. ఈ ఆదేశాల నియమానుసారం అనేక ఆంక్షలు మరియు / లేదా నగదు ఉపసంహరణ / డిపాజిట్ల స్వీకరణపై గరిష్ఠ పరిమితులు ఉంటాయి. వివరాలతో కూడిన ఆదేశాల నకలును ఆసక్తి గల ప్రజల పరిశీలనార్ధం బ్యాంకు పరిసరాలలో ఉంచడం జరుగుతుంది. పరిస్థితులను బట్టి రిజర్వు బాంక్ తమ ఆదేశాలలో మార్పు చేసే అవకాశాన్నిపరిశీలించవచ్చును. ఈ పై నిర్దేశాలు జారీ చేయబడిన కారణంగా, బ్యాంక్ లైసెన్స్ ను ఆర్.బీ.ఐ రద్దుచేసినట్లుగా ఎంతమాత్రం భావించరాదు. వారి ఆర్దిక పరిస్థితి మెరుగయ్యేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజరు
ప్రెస్ రిలీజ్: 2017-2018/1347. |