తేదీ 24/11/2017
సార్వభౌమ పసిడి బాండ్ల పథకం (Sovereign Gold Bonds Scheme) 2017-18 సిరీస్ – X - జారీ ధర భారత ప్రభుత్వ నోటిఫికేషన్ F.No.4(25)-B/(W&M)/2017 మరియు రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్, IDMD.CDD.No.929/14.04.050/2017-18 తేదీ అక్టోబర్ 06, 2017 ప్రకారం, సార్వభౌమ పసిడి బాండ్ల పథకం పెట్టుబడులకొరకై, అక్టోబర్ 09, 2017 నుండి డిసెంబర్ 27, 2017 వరకు ప్రతివారమూ, సోమవారంనుండి బుధవారంవరకు తెరిచి ఉంచబడును. ఆవారంలో స్వీకరించబడిన దరఖాస్తులకు, తదుపరివారం మొదటి వ్యాపార దినంనాడు, సెటిల్‌మెంట్ చేయబడును.
నవంబర్ 27, 2017 నుండి నవంబర్ 29, 2017 వరకు చేసిన పెట్టుబడులకు (డిసెంబర్ 04, 2017 సెటిల్‌మెంట్ జరగవలసిన), బాండ్‌యొక్క నామినల్ విలువ, అంతకు ముందువారంలోని ఆఖరి మూడు వ్యాపార దినాల, (అనగా, నవంబర్ 22 నుండి 24, 2017) 999 స్వచ్ఛత గల బంగారపు సామాన్య సగటు ముగింపు ధరపై (ఇండియా బులియన్ మరియు జ్యూవెలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లి. [India Bullion and Jewellers Association Ltd. (IBJA) ప్రకటించిన ధర] ఆధారపడి ఉండును. ఈధర, గ్రాముకు రూ. 2961 (అక్షరాలా రెండువేల తొమ్మిదివందల అరవై ఒక్క రూపాయిలు)
భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకుతో సంప్రదించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసి, డిజిటల్ మాధ్యమంద్వారా చెల్లింపుచేసే మదుపరులకు, ఒక గ్రాముకు, రూ. 50 తగ్గించవలెనని నిశ్చయించింది. అట్టి మదుపరులకు పసిడి బాండ్ ధర, ఒక గ్రాముకు, రూ. 2911 (అక్షరాలా రెండువేల తొమ్మిదివందల పదకొండు రూపాయిలు)
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-18/1443 |