డిసెంబర్ 21, 2017
ప్రాథమిక (అర్బన్) సహకార బ్యాంకుల దృక్పథం (ఔట్లుక్) 2016-17
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్.బి.ఎఫ్.సిలు), ఆర్థిక సంస్థలు (ఎఫ్ఐలు) మరియు ప్రాధమిక డీలర్ల కార్యక్రమాల పై, ‘భారతదేశంలో బ్యాంకులకు సంబంధించి గణాంకాల పట్టికలు 2016-17' అనే ప్రచురణను రిజర్వు బ్యాంకు తన వెబ్ సైట్ లో ఉంచింది.
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల కోసం, ఆస్థి మరియు అప్పుల ప్రధాన అంశాలపై సంస్థల-వారీ సమాచారం, ఆదాయం మరియు ఖర్చులు, ఎంచుకున్న ఆర్ధిక నిష్పత్తులు, ఉద్యోగుల సంఖ్య మరియు ప్రాధాన్యతా రంగానికి సంబంధించిన వివరాలు అందించబడ్డాయి. అంతేకాకుండా, మూలధన సంపద నిష్పత్తులు (సిఆర్ఏఆర్), నిరర్ధక ఆస్తులు (ఎన్.పి.ఎలు), సున్నిత రంగాలకు ఎక్సపోజర్, అనిశ్చిత రుణాలు (కాంటెజెంట్ లైబిలిటీస్) మరియు క్లెయిమ్ చేయని డిపాజిట్లు చేర్చబడ్డాయి.
కవర్ చేయబడిన సంస్థలు మరియు గ్రామీణ సహకార సంఘాల విషయంలో నాబార్డ్ అందించిన సమాచారంతో, వీలైనంతవరకూ మారే ప్రతి టైం సీరీస్ 2016-17 వరకు నవీకరించడం జరిగింది.
‘భారతీయ ఆర్థిక వ్యవస్థ డేటాబేస్’ (DBIE) క్రింద 'టైం సీరీస్ పబ్లికేషన్స్' లింక్ https://dbie.rbi.org.in/DBIE/dbie.rbi?site=publications#!4 ద్వారా ఆర్.బి.ఐ వెబ్ సైట్ లో ఈ ప్రచురణను పొందవచ్చు
జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/1712 |