జనవరి 10, 2018
పత్రికా ప్రకటన
ఆర్.బి.ఐ పరిశోధకులకు అనుబంధ అధ్యాపకుడు గా ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRBT) లో పని చేస్తున్న శ్రీ ఎస్. అనంత్, ఆధార్ భద్రతా అంశాలపై ఒక అధ్యయనం చేసాడని ప్రసార మాధ్యమాల ద్వారా భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టికి వచ్చింది. ఆర్.బి.ఐ లేదా దాని పరిశోధకులకు ఈ అధ్యయనంతో ఎట్టి సంబంధం లేదని వివరించడమైనది. అంతేకాకుండా, రచయిత వ్యక్తీకరించిన అభిప్రాయాలు ఆర్.బి.ఐ వి కావు.
జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/1900 |