జనవరి 16, 2018
నిర్దేశాల (డైరెక్షన్స్) ఉపసంహరణ - ది సూరి ఫ్రెండ్స్ యూనియన్ సహకార బ్యాంకు లిమిటెడ్,
సూరి, పశ్చిమ బెంగాల్
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 35A, సెక్షన్ 56 తో కలిపి, సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరి, పశ్చిమ బెంగాల్ కు, భారతీయ రిజర్వు బ్యాంకు, మార్చి 28, 2014 న నిర్దేశాలు (డైరెక్షన్స్) జారీచేసింది. సదరు నిర్దేశాలు ఎప్పటికప్పుడు సవరింపులతో పొడిగించబడి, చివరగా జూన్ 29, 2017 తేదీన జారీచేసిన నిర్దేశము ద్వారా, జనవరి 06, 2018 వరకూ పొడిగించబడినవి.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 35A, సెక్షన్ 56 తో కలిపి సబ్ సెక్షన్ (2) లో ఉన్న అధికారాలను వినియోగించుకుని, ప్రజా ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని, సంతృప్తి చెందినదై, భారతీయ రిజర్వు బ్యాంకు జనవరి 6, 2018 నుండి సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరి, పశ్చిమ బెంగాల్ కు జారీ చేయబడిన ఫై నిర్దేశాలను ఉపసంహరించింది. ఐనప్పటికిని, బ్యాంకు కార్యాచరణ సూచనల క్రింద కొనసాగించబడుతుంది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/1946 |